Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. ఎందుకు? పోసాని చెప్పిన నిజం ఏంటి?

Advertiesment
Posani Krishna Murali
, గురువారం, 17 జనవరి 2019 (08:58 IST)
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ నిజం వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారన్నారు. అందుకే చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు వీధుల్లోకిలాగారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చిరంజీవి తనవద్ద పలుమార్లు ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకున్నారని పోసాని వెల్లడించారు. 
 
తాజాగా టీడీపీ నేతలపై వైకాపా మహిళా నేత షర్మిల ఆరోపణలు చేశారు. దీనిపై పోసాని స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళలపై ఏమాత్రం గౌరవమర్యాదలు లేవన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎంతో గౌరవంగా చూడాల్సి ఉన్నా... ఆ రోజుల్లోనే ఆమెను చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని మహిళగా (అన్ పాప్యులర్) చేశారని చెప్పారు.
 
ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారని, అపుడు చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు ఎంతో దారుణంగా విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని షర్మిళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, కుటుంబంలోని ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని... దానికి తానే సాక్ష్యమని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండగపూటే పరలోకానికి పంపిన కసాయి... భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త