Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్‌ని లాంచ్ చేసిన సాయి కుమార్!!

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (17:03 IST)
హనుమాన్ చాలీసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి హనుమాన్ చాలీసాని సింగర్ కం డైరెక్టర్ రుషిక అద్భుతంగా ఆలపించి నటించారు. హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్‌తో రుషిక హావభావాలు అన్ని హైలెట్ అనేలా ఉన్నాయని...  ఈ హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్ చేసిన సాయి కుమార్ ప్రత్యేకంగా సింగర్ రుషికని మెచ్చుకున్నారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్స్‌తో ఈ సాంగ్‌ని తెరకెక్కించారని.. ఈ పాటని ఆలపించి, డైరెక్ట్ చేసి, నటించిన రుషికాని సాయి కుమార్ అభినందించారు.
 
రుషిక మాట్లాడుతూ..  మేము హనుమాన్ చాలీసాని ప్రస్తుత తరానికి అర్ధమయ్యే రీతిలో కాస్త వినూత్నంగారాప్ మోడల్ లో చిత్రీకరించటం జరిగింది. లిరిక్స్/సాహిత్యాన్ని మాత్రం మార్చలేదు. పాటచిత్రీకరణలో ఉపయోగించిన చిత్రాలు మరియు ప్రదేశాల అనుమతులు అన్ని తీసుకోవటం జరిగింది. పాట కి సంబందించిన కొన్ని పనుల కోసం పద్మజ హాస్పిటల్ అండ్ స్కిల్టెక్నాలజీస్ వారి సహాయం తీసుకోవటం జరిగింది. ఎలాంటి ఆర్థిక/లాభాపేక్ష లేకుండా కేవలంహనుమాన్ చాలీసాని ప్రజలకు మరింత చేరువ చేయటం కోసం మాత్రమే ఈ పాటని చిత్రీకరించి, విడుదలచేయటం జరిగింది.
 
 ఈ పాట ని ప్రచురించటానికి, ప్రసారం చేయటానికి, టెలివిజన్లు & సోషల్ మీడియాతదితర రంగాలకి ఇత్య టీవీ యాజమాన్యం పూర్తి అనుమతినిస్తుందని తెలియజేస్తున్నాము. దర్శకత్వం/నటన/గాయకురాలు - రుషిక, అలంకరణ - లక్ష్మణ్, చిత్రీకరణ - రుద్ర ఈక్విప్మెంట్స్,చిత్రీకరణ సహాయకులు - విష్ణు వర్ధన్, డి.ఓ.పి/ఎడిటర్ - నవీన్ తొగిటి, ఔట్ డోర్ యూనిట్- ఎస్.ఆర్.లైట్స్, లైట్ ఆఫీసర్ - నాని చౌదరి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments