Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం రోజు మిరియాల పొడిని వాడితే..? రావిచెట్టును తాకితే? (video)

శనివారం రోజు మిరియాల పొడిని వాడితే..? రావిచెట్టును తాకితే? (video)
, శనివారం, 10 అక్టోబరు 2020 (05:00 IST)
శనివారం రోజు ఎరుపు మిరప స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. అంతేకాకుండా ఆహారంలో నలుపు ఉప్పును వాడాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఏలినాటి శని తొలిగిపోతుంది.
 
అలాగే శనివారం రోజు రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి. తేలికపాటి నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇదే సమయంలో అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా వైద్యం చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థికంగానూ పుంజుకుంటారు.
 
అందరికీ నూనెతో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండకపోవచ్చు. ఇలాంటి వారికోసం శ్రీ మద్రామాయణంలోని సుందరకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం, సాయంకాలం పఠిస్తే.. శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. వీటితోపాటు హనుమాన్‌చాలీసా పారాయణం, వేంకటేశ్వరస్వామి గోవిందనామాలు, శుద్ధజలంతో శివాభిషేకం చేసినా మంచి ఫలితం వస్తుంది. ధనాదాయం చేకూరుతుంది. 
webdunia
Lord Shani
 
అలాగే బ్రహ్మపురాణం 118వ అధ్యాయంలో శనిదేవుడు చెప్పిన వాక్యాలు ''నా రోజు అంటే శనివారం నాడు ఎవరైతే క్రమం తప్పకుండా రావిచెట్టును తాకుతారో వారి సర్వకార్యాలు నెరవేరుతాయి.

నా నుంచి వారికి ఎటువంటి బాధలు కలుగవు. శనివారం వేకువజామున లేచి రావిచెట్టు ప్రదక్షిణలు లేదా స్పర్శిస్తారో వారికి గ్రహాల బాధలు కూడా రావు రావిచెట్టు వద్దకు వెళ్లినప్పుడు కలియుగదైవం వేంకటేశ్వరనామ స్మరణ చేయండి మరింత మంచి ఫలితం వస్తుంది" అని చెప్పివున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడికి వెళ్లినప్పుడు ఇలా చేయాలి