1. ఆలయాన్ని ప్రదక్షిణిగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి. మెల్లగా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడను కానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు.
4. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట
సత్యాన్ని దాచకూడదు.
5. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు.
6. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరం కప్పుకోవాలి.
7. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు.