Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోతుల ఆకలి బాధ తీర్చుతున్న చెన్నై ఫుడ్ బ్యాంక్

కోతుల ఆకలి బాధ తీర్చుతున్న చెన్నై ఫుడ్ బ్యాంక్
, సోమవారం, 5 అక్టోబరు 2020 (18:43 IST)
చెన్నై నగర శివారు ప్రాతంమైన షోళింగర్‌లో ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం, అంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చెట్లపై నివసిస్తున్న సుమారు రెండు వేల కోతుల ఆకలి బాధను చెన్నై ఫుడ్ బ్యాంకు తీర్చుతోంది. ఈ కోతులకు ప్రతి రోజూ వివిధ రకాల ఆహారాన్ని అందిస్తోంది. ఈ ఫుడ్ బ్యాంకును ఆర్‌వైఏ మద్రాస్ మెట్రో ట్రస్టు నిర్వహిస్తోంది. 
 
ఇక్కడ నివశించే ఈ కోతులకు చెట్లపై ఎలాంటి ఆహారం అందుబాటులో లేదు. కేవలం ఈ ఆలయానికి వచ్చే భక్తులపైనే ఆధారపడిజీవిస్తున్నాయి. దీంతో అనేక కోతులు ఆహారం లభించక ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నై ఫుడ్ బ్యాంకు ఈ కోతులకు సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తోంది. 
 
ఈ కోతుల దుస్థితి గురించి తెలుసుకున్న చెన్నైలోని ఈ మద్రాస్ మెట్రో ట్రస్ట్ గత సెప్టెంబర్ 20 నుండి ప్రతిరోజూ "రుచికరమైన పెరుగు బియ్యం, అరటి మరియు కాల్చిన బెంగాలీ వేరుశెనగ"ను అందిస్తోంది.
webdunia
monkeys
 
దీనిపై చెన్నై ఫుడ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ, గత సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఇలా ఆహారం ఇవ్వడం ద్వారా మన దైవిక సేవను తాము కొనసాగిస్తున్నట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఈ కోతులకు ఆహారాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థానికులతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఆర్.వై.ఏ మద్రాస్ మెట్రో ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే "చెన్నై ఫుడ్ బ్యాంక్" అనేది లాభాపేక్షలేని ఐఎస్‌వో సర్టిఫికేట్ కలిగిన ఎన్జీవో సంస్థ. చెన్నై నగరంలో ఉన్న ప్రఖ్యాత సంస్థల్లో ఇదొకటి. ఇది ఆకలి, అవాంతరాలు లేని సమాజ ఏర్పాటు కోసం ఈ సంస్థ పని చేస్తోంది. అలాగే, "చెన్నై ఫుడ్ బ్యాంక్" గత 27 సంవత్సరాలుగా చెన్నై పరిసరాల్లోని పేద ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడం ద్వారా విజయవంతంగా పనిచేస్తోంది. 
 
ఇప్పటివరకు "చెన్నై ఫుడ్ బ్యాంక్" పేదలకు 40 మిలియన్ల భోజనం అందించింది. ప్రపంచంలో ఆకలి నిర్మూలనకు ఇది తీవ్రమైన ప్రయత్నం. "చెన్నై ఫుడ్ బ్యాంక్" తన లబ్ధిదారులకు చిరునవ్వుతో ఆహారాన్ని అందించడం ద్వారా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు.. చెల్లెల్ని హత్య చేసిన అక్క.. ఎక్కడ?