Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మామ' మనాలి వెళుతున్నారు.... ఇపుడు 'కోడలు' వస్తుందట...?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (16:54 IST)
తెలుగులో ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్-4. దీనికి ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. అయితే, పలువురు సెలబ్రిటీలు అందులో పాల్గొంటుండడంతో పాటు ప్రతి సీజన్‌కీ ఒక్కో టాప్‌స్టార్ హోస్టుగా వ్యవహరిస్తూ షోని రక్తికట్టిస్తూ వస్తున్నారు. అందుకే, దీనికి మంచి టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే లభిస్తోంది. 
 
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సాగుతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఇప్పటికే పలు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే, ఇప్పుడు ఒక చిక్కొచ్చిపడింది. హోస్టు అక్కినేని నాగార్జున కొన్నాళ్ల పాటు ఈ షోకి అందుబాటులో ఉండడం లేదట. 
 
ఆయన హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరుగుతోంది. ఇటీవలే నాగార్జున కూడా మనాలి వెళ్లి షూటింగులో పాల్గొన్నారు. సుమారు నెల రోజుల పాటు ఈ షెడ్యూలును అక్కడ ప్లాన్ చేశారు. నాగార్జున పాల్గొనే ముఖ్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. దీంతో ఆయన నెల రోజుల పాటు మనాలిలో ఉండాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ఈ నెల రోజుల పాటు.. ఆయన కోడలైన హీరోయిన్ సమంత అక్కినేని హోస్టుగా వ్యవహరిస్తారనే ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు తారల పేర్లు వినపడినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సమంత పేరు తెరపైకి వచ్చింది. నాగార్జున సలహా మీదే ఆమె హోస్టు చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments