Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్‌` అయిన గోపీచంద్‌

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (06:59 IST)
Pakka Commercial look
ప్ర‌తిరోజు పండ‌గే త‌రువాత ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమా టైటిల్‌పై ఆస‌క్తినెల‌కొంది. ఇద్ద‌రు స్నేహితులు మాట్లాడుకుంటూ టైటిల్ ఏమిటి? చెప్ప‌మ‌న‌డం.. చెప్పాలంటే కాస్త ఖ‌ర్చ‌వుతుందంటూ, ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌రీ ఇంత క‌మ‌ర్షియల్లా! అంటూ సెటైర్‌కూడా అందులో వుంటుంది. ఇలా కార్టూన్ క్యారకేచ‌ర్లు వాడుతూ వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ చిత్ర విడుదల తేదీని  ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అనే టైటిల్ ని ప్ర‌క‌టించి, టైటిల్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూ వి క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాల, ప్రతిరోజు పండుగ తో హాట్ట్రిక్ రాగా ఇప్పుడు డబల్ హాట్ట్రిక్ కి శ్రీకారం చుడుతూ గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది, ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు, ఎస్ కే ఎన్ సహ నిర్మాత‌. మార్చి 5 నుంచి ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ షూట్ మొద‌ల‌వ్వ‌బోతుంది, ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌ణ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments