Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర‌వితేజ కొడుకు పాత్ర చూసి.. నీ కొడుకేగా.. అని అడిగారు..? క్రాక్ డైరక్టర్

ర‌వితేజ కొడుకు పాత్ర చూసి.. నీ కొడుకేగా.. అని అడిగారు..? క్రాక్ డైరక్టర్
, మంగళవారం, 19 జనవరి 2021 (17:58 IST)
Gopichand Malineni
డాన్ శ్రీ‌ను, బ‌లుపు వంటి చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ఈ సంక్రాంతికి ర‌వితేజ‌తో తీసిన `క్రాక్‌` విడుద‌ల‌యింది. తొలిరోజు మూడు ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌డ‌క‌పోయినా ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లోనే సినిమా చూడాల‌నే ఆస‌క్తితో రాత్రి 10.30 గంట‌ల‌కు షో ప‌డినా గుంపులు గుంపులుగా వ‌చ్చి ఉన్న 50 శాతం ఆక్సుపెన్సీని ఫుల్‌చేయ‌డం ర‌వితేజ కెరీర్‌లో హ‌య్య‌స్ట్.. అని ఇందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని... ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఆనందాన్ని వెబ్‌దునియాతో పంచుకున్నారు.
 
ప్రశ్న: సినిమా ఆల‌స్యం కావ‌డానికి ఏమిటి? నిర్మాత‌గారు లేర‌నే వార్త‌లు వినిపించాయి?
జ : అవి అంద‌రికీ తెలిసిన‌వే.. దాని గురించి ఏమీ మాట్లాడ‌లేను. సాంకేతిక‌మైన అంశాలు వున్నాయి.
 
ప్రశ్న: క‌రోనా మీ సినిమాను బ్రేక్ ఇచ్చింది క‌దా.. ఎలా అనిపించింది?
జ : క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మార్చి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు మాన‌సిక క్షోభ‌.. ఓటిటికి వెళ్ళాల‌నే ఒత్తిడి పెరిగింది. ఎట్టి ప‌రిస్థ‌తిలో క్రాక్ ఈజ్ ఓన్లీ థియేట‌ర్ అని పోస్ట్ చేశాను. అప్పుడే నా జ‌డ్జిమెంట్ ఏమిటో అంద‌రికీ తెలిసిపోయింది. అలా చెప్ప‌డానికి సినిమాపై నాకున్న న‌మ్మ‌కం. కంటెంట్ సినిమా.  మాస్ కంటెంట్ థియేట‌ర్ల‌లో చూస్తేనే మాజా వేరు. అందుకే దాన్ని న‌మ్మాను. 
webdunia
Gopichand Malineni
 
ప్రశ్న: రిలీజ్ రోజు ఎలా ఫీల‌య్యారు?
జ : అంతా స‌జావుగా జ‌రుగుతున్న టైంలో ఈ నెల 9వ తేదీన జ‌రిగిన సంఘ‌ట‌న నాకు షాక్ గురిచేసింది. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు న‌ర‌కం అనుభ‌వించా. నిద్ర స‌రిగా ప‌ట్ట‌లేదు. ఎవ‌‌రికీ ఇలా జ‌ర‌గ‌కూడ‌దు. ఆరోజు మూడు షోలు ప‌డ‌లేదు. అయినా రాత్రి షో ప‌డిన త‌ర్వాత ప్రేక్ష‌కులు వ‌చ్చి చూపిన ఆద‌ర‌ణ మ‌ర్చిపోలేను. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా.
 
ప్రశ్న: షో ప‌డ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి?
జ : ముందురోజు అంటే 8వ తేదీ సాయంత్రానికి సెటిల్ అవుతుంద‌నుకున్నాం. కానీ కాలేదు. అలాంటి స‌మ‌యంలో నిర్మాత‌లు ఎన్‌.వి.ఎస్‌. ప్ర‌సాద్‌, వంశీ, దాము వంటివారు ఎంతో స‌పోర్ట్ చేశాను. నువ్వు ఇలా ఎరేంజ్ చేసుకో.. మేం మీ వెనుక వున్నామ‌ని భ‌రోసా క‌ల్పించారు.
 
ప్రశ్న: హిట్ ఎలా అనిపిస్తుంది?
జ : సినిమాలో ద‌మ్ము వుంది. అందుకే మంచి ఊపుతో అంద‌రం వున్నాం.
 
ప్రశ్న: ద‌ర్శ‌కులు అభినంద‌న‌లు తెలిపారా?
జ : అంద‌రూ చేశారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, సురేంద‌ర్‌రెడ్డి, వంశీపైడిప‌ల్లి, హ‌రీశ్‌శంక‌ర్‌, బోయ‌పాటి శ్రీ‌ను, వినాయ‌క్ వంటి వారంతా.. ఎంతో అభినంద‌లు తెలిపారు.
 
ప్రశ్న: హీరోలు ఎవ‌రైనా?
జ : మెగాస్టార్ చిరంజీవిగారి ప్ర‌శంస‌ మ‌ర్చిపోలేనిది. సినిమాలో ర‌వితేజ కొడుకు పాత్ర చూసి.. నీ కొడుకేగా.. నీ లానే వున్నాడ‌ని.. అన్నారు.. ఇక ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌.. మంచి ట్వీట్ చేశాడు. సాయిధ‌ర‌మ్‌తేజ‌, మంచు మ‌నోజ్ ఇలా అంద‌రూ ఎంక‌రేజ్ చేశారు.
 
ప్రశ్న: రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా వుంటుందా?
జ : ఆయ‌న నాతో డైరెక్ట్‌గా ఏమీ చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం వేరే సినిమా చేయ‌బోతున్నా ఆ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాను.
 
ప్రశ్న: క్రాక్ సినిమాకు అంద‌రి ఫ్యాన్స్ బాగా స‌పోర్ట్ చేశారు?
జ : అవును. ఫ్యాన్స్ అనేవారు సినిమా ప్రియులు. ఏ హీరో సినిమా అయినా బాగా ఆడాల‌నుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అంద‌రూ స‌పోర్ట్ చేశారు.
 
ప్రశ్న: షో.. అనుకున్న‌టైంకు ప‌డ‌క‌పోవ‌డంతో ఎలా అనిపించింది?
జ : మూడు షోలు ప‌డ‌క‌పోవ‌డంతో మంచి రెవెన్యూ మిస్ అయ్యాము. అయినా నేటివ‌రకు హౌస్‌ఫుల్‌తో ర‌న్ అవుతుంది. కాక‌పోతే స‌రైన టైంలో ప‌డ‌క‌పోవ‌డంతో మెంట‌ల్ కండిష‌న్ బాగోలేదు. ఒత్తిడికి గుర‌య్యాను. థియేట‌ర్‌కు వెళ్ళినా.. ఎంత‌మంది వ‌చ్చార‌నేది కూడా చూడ‌లేక‌పోయా.. ప్రేక్ష‌ఖులు థియేట‌ర్ కు వ‌చ్చి షో లేద‌నీ. తిరిగి వెళ్ళిపోయి.. మ‌ర‌లా వ‌చ్చి చూడ‌డం.. మంచి సైన్‌గా భావిస్తున్నా.  
 
ప్రశ్న: ఇంత‌కుముందు సినిమా ఎందుకు ఫెయిల‌యింది?
జ : ఒక దెబ్బ త‌గిలికానీ తెలీదు. కొన్ని ప‌రిస్థితులు అలా జ‌రుగుతాయి. ఏమీ చేయ‌లేం.
 
ప్రశ్న: ఒంగోలు బేక్‌డ్రాప్‌.. ఎవ‌రికైనా క‌నెక్ట్ అయిందా?
జ : చాలా చోట్ల అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగే వుంటాయి. క‌టారి కృష్ణ‌, వేట‌పాలెం బేచ్‌, జ‌య‌మ్మ పాత్ర‌, అంక‌డి పాత్ర‌.. ఏదో ఒక చోట ఇలాంటి వారు వుంటారు. ఈ సినిమా చూశాక‌.. మేం గ‌తంలో విన్నాం.. ఇప్పుడు తెర‌పై చూస్తున్నామంటూ.. చాలామంది ఫోన్ లో చెప్పారు.  
 
ప్రశ్న: సేతుప‌తి.. క‌థ‌లా వుంద‌ని కామెంట్ వ‌చ్చింది?
జ : సేతుప‌తి క‌థ‌కు దీనికి సంబంధంలేదు. హీరోకు ఫ్యామిలీ వుండాలి. బ‌హుశా అలా వారికి అనిపించి వుండ‌వ‌చ్చు. కొంద‌రు ఛ‌త్ర‌ప‌తిలా వుంద‌న్నారు.. ఎవ‌రి ఆలోచ‌న‌లు వారివి.
 
ప్రశ్న: క్రాక్‌కు సీక్వెల్ వుందా?
జ : త‌ప్ప‌కుండా వుంటుంది. ఎప్పుడ‌నేది చెప్ప‌లేను.
 
ప్రశ్న: హిందీలో చేస్తారా?
జ : అడుగుతున్నారు. మంచి కంపెనీ, హీరో దొర‌కాలి. అక్ష‌య్‌కుమార్‌, అజ‌య్‌దేవ్‌గ‌న్‌, ర‌ణ‌వీర్ సింగ్ ఇలాంటివారు స‌రిపోతారు.
 
ప్రశ్న: ఈ సినిమా త‌ర్వాత క‌థ‌లు రాసే విధానం మారుతుందా?
జ : త‌ప్ప‌కుండా మారుతుంది. క్రాక్ చేస్తుండ‌గా... మ‌రో క‌థ‌కూడా. రాసుకున్నా..
 
ప్రశ్న: ఇది వెంక‌టేష్‌కు చెప్పారా?
జ : లేదు. ర‌వితేజ‌కే చెప్పా.
 
ప్రశ్న: ముందు సినిమా ఏమి జ‌రిగింది?
జ : ఒక దెబ్బ‌ త‌గిలితే కానీ.. తెలీదు. స్వంత క‌థ‌లతో సినిమా చేస్తేనే  ఒరిజిన‌ల్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అరువు క‌థ తెస్తే.. కొన్ని అలానే జ‌రుగుతాయి.
 
ప్రశ్న: నైజాంలో ముందురోజు మీ సినిమాను తీసేసి వేరే సినిమా వేశారు. అప్ప‌డు ఎలా అనిపించింది?
జ : దీనిపై ఏమీ మాట్లాడ‌లేను. అంద‌రూ కావాలి. అన్ని సినిమాలు ఆడాలి.  
 
ప్రశ్న: కొత్త సినిమా?
జ : మైత్రీమూవీస్‌పై సినిమా చేయ‌బోతున్నా. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లైగర్‌'కు బీరాభిషేకం - రచ్చ చేసిన రౌడీ ఫ్యాన్స్