Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందే రాసి పెట్టి వుందంటోన్న "క్రాక్" ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్‌

Advertiesment
ముందే రాసి పెట్టి వుందంటోన్న
, శుక్రవారం, 8 జనవరి 2021 (20:26 IST)
హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం క్రాక్. ఈ చిత్రం శనివారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, కోవిడ్ రాకుండా వుంటే ఎప్పుడో రిలీజ్ కావాల‌సింది. కానీ మంచి సీజ‌న్ రావాలి. సంక్రాంతికి రావాలి. హిట్ రావాల‌ని అని రాసి పెట్టివుంది. హిట్ అనేది మొన్న ఫంక్ష‌న్‌లో మా అంద‌రిలోనూ క‌న్పించింద‌న్నారు. 
 
9వ తేదీనే ఎందుకు వ‌చ్చామంటే... 13,14,15.. తేదీల్లో మూడు సినిమాలు వున్నాయి. థియేట‌ర్లు డివైడ్ అవుతాయి. మేం మాస్ ఫిలింతో వ‌స్తున్నాం. పండ‌గ‌కు అంటే 9వ తేదీ నుంచే ప్ర‌జ‌ల‌కు ఆ వాతావ‌ర‌ణంలో వుంటారు. అందుకే వ‌చ్చాం. ఇక ర‌వితేజ కెరీర్‌లో హ‌య్యస్ట్ థియేట‌ర్లో విడుద‌ల‌వుతుంది.
 
ఈ క‌థ 20 ఏళ్ళ క్రితం ఒంగోలు ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన క‌థ‌. స‌ర్ప‌యాగంలో కొన్ని సీన్లు అలా క‌నిపిస్తాయి. ఇందులో పూర్తిగా వుంటుంది. ఓ గ్యాంగ్‌.. బిర్యానీకోసం, 50,100 రూపాయ‌లు కోసం మ‌ర్డ‌ర్లు చేస్తుంటారు. ఒంగోలులో 20 ఏళ్ళ క్రితం రౌడీయిజం వుండేది. వారు చేసే ప‌నులు నేను చ‌దువుకునే రోజు్లోల్ చాలా ఆస‌క్తిగా అనిపించేది.
 
డాన్‌ శ్రీ‌ను, బ‌లుపు త‌ర్వాత 3వ సినిమా నేచుర‌ల్ అప్రోజచ్ చేస్తే బాగుంటుంద‌ని అనిపించింది. రంగ‌స్థ‌లం లాంటి నేచుర‌ల్ సినిమాను లైక్ చేస్తున్నారు. అందుకే అప్ప‌ట్లో మా ఊరులోని క‌థ‌ను. సినిమాటిక్‌గా తీసుకుని క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ చేస్తూ.. క‌ల్పితం చేసి తీశాను. అదే క్రాక్‌. 
 
ట్రైల‌ర్‌లో చూపిన గేంగ్ చాలా రా.. గా వుంటారు. అప్ప‌ట్లో సీ కోస్ట్ ఏరియాలో క‌బ‌డీ బేచ్ వుండేది. వారంతా. గాడిద నెత్తురు తాగి ప‌రుగెడ‌తారు.. అలా చేయ‌క‌పోతే.. గ‌డ్డ‌క‌ట్టి చ‌చ్చిపోతారు. అందుకే అది తాగి ప‌రుగెడితే.. గాడిద‌లాగా.. చ‌ర్మం మొద్దుబారిపోతుంది. అలాంటి గేంగ్‌.. చేసిన అరాచ‌కాల‌కు క్రాక్ లాంటి పోలీస్ ఆఫీస‌ర్ ఎటువంటి ముగింపు ఇచ్చాడ‌నేది క‌థ‌.
 
స‌హ‌జంగా అర్జున్‌ రెడ్డి నుంచి కానీ అంత‌కుముందు గానీ.. ఇంగ్లీషు టైటిల్ పెడుతున్నారు. అందుకే క్రాక్ అని పెట్టాం. దీనికి జ‌నాలు అల‌వాటు ప‌డిపోయారు. ఇందులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, డ‌బ్బింగ్ ర‌వి, స‌ముద్ర‌ఖ‌ని కేరెక్ట‌ర్‌కు బాగా సూట‌య్యారు. ఈ పాత్ర‌ల‌నీ ఒంగోలులో నేను చూసిన‌వే అందుకే వారిని పెట్టాం.
 
జ‌నాలు నేచుల‌ర్‌గా అబ్బిగా, సుబ్బిగా, నా కొడ‌కా అనే ప‌దాలు కేజువ‌ల్‌గా అంటుంటారు. అందుకే డైలాగ్‌లు బుర్రా సాయిమాధ‌వ్. రాసిన సంభాష‌ణ‌లు హైలైట్‌గా నిలిచాయి. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. కొత్త అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌న కోరికకు నా మాట‌లు తోడ‌య్యాయి : రష్మి గౌతమ్