Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్రాంతికి వస్తున్న "క్రాక్"... రిలీజ్ డేట్ ఫిక్స్

Advertiesment
సంక్రాంతికి వస్తున్న
, ఆదివారం, 3 జనవరి 2021 (09:16 IST)
టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా గుర్తింపు పొందిన హీరో రవితేజ. ఈయన నటించిన తాజా చిత్రం క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. పైగా, ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించి, విడుదల తేదీని కూడా ప్రకటించింది. 
 
నిజానికి మొన్నటికి మొన్న సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదలైంది. తొలి మూడు రోజుల పాటు కలెక్షన్స్ బానే వచ్చాయి. ఇప్పుడు మాస్ రాజా దీన్ని కంటిన్యూ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఈయన హీరోగా నటిస్తున్న క్రాక్ సెన్సార్ పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో పాటు చాలా తక్కువ టైమ్ లోనే కోటి వ్యూస్ అందుకుంది. ఖచ్చితంగా ఈ చిత్రంతో రవితేజ ఫామ్‌లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. నాలుగేళ్ళ తర్వాత శృతి హాసన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. 
 
"బలుపు" తర్వాత మరోసారి గోపీచంద్, శృతి హాసన్, రవితేజ కాంబినేషన్ ఈ మూవీ తెరకెక్కింది. ఆ సక్సెస్ మరోసారి వస్తుందని బలంగా నమ్ముతున్నారు. అలాగే, "రాజా ది గ్రేట్" తర్వాత మూడేళ్ళుగా సరైన సక్సెస్ లేక రవితేజ అల్లాడిపోతున్నాడు. ఇలాంటి సమయంలో రవితేజ "క్రాక్" అంటూ వస్తున్నాడు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉండటంతో ఖచ్చితంగా ఈ మూవీ హిట్ సాధిస్తుందని నమ్ముతున్నారు. కాగా, ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాగా, యూఏ సర్టిఫికేట్ దక్కింది.
 
ఈ సినిమాలో వయోలెన్స్ కూడా ఎక్కువగానే ఉండటంతో 'యు'కు తోడుగా 'ఏ' కూడా సెన్సార్ బోర్డు ఇచ్చింది. జనవరి 9న ఈ సినిమా విడుదలకానుంది. ముందు జనవరి 14న విడుదల చేయాలనుకున్నా కూడా "రెడ్" సినిమాతో పోటీ ఎందుకుని ఐదు రోజులు ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి ఇచ్చిన మాట కోసం గంగవ్వకు 18 లక్షలు నాగచైతన్య ఇచ్చారా?