Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవితేజ 'క్రాక్' : "బల్లేగా తగిలావే బంగారం" లిరికల్ సాంగ్ రిలీజ్

Advertiesment
రవితేజ 'క్రాక్' :
, సోమవారం, 14 డిశెంబరు 2020 (16:16 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ మొత్తం పాట‌ల‌తో స‌హా పూర్త‌యింది. హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌ల‌పై కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం ఆధ్వ‌ర్యంలో 'బ‌ల్లేగా త‌గిలావే బంగారం' పాట‌ను చిత్రీక‌రించారు. ఈ సాంగ్‌ లిరిక‌ల్ వీడియోను సోమ‌వారం చిత్ర బృందం విడుద‌ల చేసింది.
 
త‌మ‌న్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కు హుషారైన లిరిక్స్‌తో రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించిన‌ 'బ‌ల్లేగా త‌గిలావే బంగారం' పాట‌ను అనిరుధ్ ర‌విచంద‌ర్ పాడ‌టం విశేషం. ఆయ‌న వాయిస్ ఈ పాట‌కు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌ను తీసుకొచ్చింది. 
 
ఈ పాట‌లో శ్రుతి అంద‌చందాల‌ను పొగుడుతూ, ఆమెను అల్ల‌రి చేస్తూ క‌నిపించారు ర‌వితేజ‌. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన 'భూమ్ బ‌ద్ద‌ల్' సాంగ్ ఎంత హిట్ట‌య్యిందో, 'బ‌ల్లేగా త‌గిలావే బంగారం' పాట కూడా ఇన్‌స్టంట్ హిట్ట‌యింది. ఆన్‌లైన్‌లో ఈ పాట వైర‌ల్‌గా మారింది.
 
తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలున్నాయి. ఇదివ‌ర‌కు విడుద‌ల చేయ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిన‌ "భూమ్ బ‌ద్ద‌ల్" స్పెష‌ల్ సాంగ్‌లో ర‌వితేజ‌తో క‌లిసి అప్స‌రా రాణి స్టెప్పులేశారు.
 
స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 'క్రాక్' మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
 
తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి
 
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాటపర్వం అప్‌డేట్స్ : 'కామ్రేడ్ రవన్న'గా రానా దగ్గుబాటి