Ravi Teja, Gopichand Malineni
2010లో `డాన్ శీను`, 2013 `బలుపు`తో హిట్‌లు ఇచ్చిన కాంబినేషన్. రవితజే, దర్శకుడు మలినేని గోపీచంద్.. ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నానికి ఏడేళ్ళు పట్టింది. అంటే 2020కి.. అది సెట్ అయింది. ఆ సినిమానే `క్రాక్`. ఆ సినిమాను ముందు ఓటీటీలో విడుదల చేయాలనికున్నా... దర్శకుడు గోపీచంద్ పట్టుబట్టి థియేటర్ ఓపెన్ అయ్యేవరకూ ఆగాడు. తను ఆశించిన విధంగానే ఆ సినిమా విజయవంతంమైంది.
2021 సంక్రాంతికి అది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో రవితేజ చాలా కాలం గేప్‌తో చేసినా ఆ సినిమాతో హ్యాట్రిక్ ఇచ్చారనే పాజిటివ్ టాక్‌తో సినీరంగం సందడిగా వుంది. మరి హీరో రవితేజ, గోపీచంద్ సంగతి వేరే చెప్పాలా.. ఇద్దరూ తమ హ్యాట్రిక్‌ను ఇలా హగ్ చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు.
Ravi Teja, Gopichand Malineni
దర్శకుడు గోపీచంద్ ఈ స్టిల్‌ను బయటకు వదిలాడు. అచ్చం రవితేజ బ్రదర్‌లా వుంటారని అందరూ తనను అంటుంటారనీ.. ఈ సినిమాలో ఏకంగా రవితేజ కొడుకుగా.. గోపీచంద్ కొడుకునే యాక్్ట చేయించడంతో.. ఇప్పుడు ముగ్గురు కలిసిన సినిమా సక్సెస్ అవడం చాలా ఆనందంగా వుందని గోపీచంద్ అంటున్నాడు. మా వాడు అయితే.. ఏకంగా డిస్నీలాండ్ వంటి ప్లేస్‌కు తీసుకువెళ్ళమంటున్నాడని.. గోపీంచద్ తెలియజేశాడు.