సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ : నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
శనివారం, 12 అక్టోబరు 2024 (14:31 IST)
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం "గేమ్ ఛేంజర్". శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. 
 
అయితే, ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ, ఈ తేదీని మార్చారు. 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు శనివారం ఓ వీడియో సందేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేయటానికి తమకు సపోర్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇదే అంశంపై దిల్ రాజు స్పందిస్తూ, 'గేమ్ ఛేజర్'ను ముందుగా ఈ యేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం.
 
మూడేళ్లుగా 'గేమ్ చేంజర్' సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న 'విశ్వంభర' సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిని, యువీ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు.
 
'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి వస్తుండటంతో వాళ్ల 'విశ్వంభర' సినిమాను మరో రిలీజ్ తేదీన విడుదల చేయాలనుకున్నారు. నిజానికి 'విశ్వంభర' సినిమా ముందు అనుకున్న విడుదల తేదీ నాటికే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా పూర్తవుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మరో రిలీజ్ డేటు విడుదల చేయటానికి ఒప్పుకున్నందుకు చిరంజీవి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు.
 
‘గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దతూ రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన 'రా మచ్చా మచ్చా..' యూ ట్యూబ్లో మారుమోగిపోతుంది. అతి త్వరలోనే టీజర్ వస్తుంది. ఆ తర్వాత మరో మూడు పాటలను రిలీజ్ చేస్తాం' అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments