Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబ్బింగ్ సినిమాలపై అబ్బూరి రవి విమర్శలకు సొల్యూషన్ దొరుకుతుందా?

Abburi Ravi'

డీవీ

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:10 IST)
Abburi Ravi'
బొమ్మరిల్లు, కిక్, ఎవడు సినిమాలకు సంభాషణల రచయితగా అయిన అబ్బూరి రవి పలు సినిమాలకు అచ్చమైన తెలుగు పదాలు వుండేలా చూసుకుంటారు.అలాంటి ఆయన ఇప్పుడు వస్తున్న తమిళ సినిమాలను తెలుగులో విడుదలచేస్తే తమిళ టైటిల్స్ ఏమిటి? తెలుగువారు అంత చులకనా? తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు. అంటూ ఎక్స్ లో స్పందించారు. అందుకు సోషల్ మీడియా ఆయనను సపోర్ట్ చేసింది.
 
“డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో,  ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు.  వారి వారి భాష లలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం నచ్చట్లేదు. 
 
తెలుగు ని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు అని పేర్కొన్నారు.
 
అయితే ఈ విషయంలోనూ 2006,2018 లోనూ పలు సంవత్సరాలలో తెలుగు టైటిల్స్ డబ్బింగ్స్ సినిమాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి (ఫిలింఛాంబర్)లో పెద్ద చర్చే జరిగింది. కానీ కొద్దిరోజులు వాటిని నియంత్రించగలిగారు. కానీ రానురాను కోవిడ్ తర్వాత మరీ సినిమాల కంట్రోల్ తప్పిందనే చెప్పాలి. ఆ తర్వాత వస్తున్న దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా తెలుగు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్, తెలుగు సినిమా విశేషాలను ఇంగ్లీషులో ముంద్రించడం జరిగింది. టైటిల్స్ కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లలో ఆంగ్లంలోనే పెడుతున్నారు. ఈ విషయమై చాలాసార్లు దర్శక నిర్మాతలు, హీరోలను అడిగినప్పుడు వారంతా... ఓవర్ సీస్ వ్యాపారం కోసమే పెట్టామని క్లారిటీ ఇచ్చారు. 
 
ఇదే విషయమై దిల్ రాజుకూడా ఓ సందర్భంగా కొన్ని టైటిల్స్ కు తప్పనిసరి అని వివరించారు. ఆ తర్వాత ఆయన తెలుగు టైటిల్స్ ను ప్రోత్సహిస్తున్నారు. కానీ తమిళ డబ్బింగ్ విషయంలో ఒక రూల్ ఖచ్చితంగా తీసుకురావాలని అన్నారు. మరి అది ఎవరు చేయాలి? ఛాంబరా? సెన్సార్ డిపార్ల్మెంటా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చాలామంది యువ నిర్మాతలు, దర్శకులు, హీరోలుగా చేసేవారికి తెలుగు దాదాపు అర్థంకాదు అనే చెప్పాలి. ఇంగ్లీషులో డైలాగ్ లు రాసుకుని తెలుగులో అనువదించే టీమ్ కూడా వుంది.  కొందరు అగ్రహీరోలకు కూడా తెలుగు చదవడం రాదు. కానీ ఇంగ్లీషులో డైలాగ్స్ రాసుకుని కెమెరా ముందు చెబుతుంటారు.
 
కానీ ఇప్పుడు అబ్బూరి రవి లేవనెత్తిన అంశం తమిళ డబ్బింగ్ టైటిల్స్ గురించి. తమిళంలో ఆయా కథలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు కనుక ఇవి తెలుగులోనూ అలాగే వుంటాయని కంగువా,  వలిమై వంటి నిర్మాతలు తెలియజేశారు కూడా. ఈ విషయమై తాజాగా ఛాంబర్ కార్యదర్శి కుమార్ అదే తెలియజేస్తున్నారు. దీనిపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం వుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే ప్రభాస్ పెళ్లి... స్పష్టత ఇచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి