Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

Dil Raju

ఠాగూర్

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (11:35 IST)
సుహాస్ హీరోగా దర్శకుడు సందీప్ బండ్ల తెరెకెక్కించిన చిత్రం "జనక అయితే గనక" అనే చిత్రంపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 12వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రం నచ్చితే "బలగం" చిత్రం తరహాలో ప్రోత్సహించాలని లేనిపక్షంలో సైలెంట్‌గా ఉండిపోవాలని కోరారు. సినిమాల సక్సెస్ అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వంద మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అవుతుందన్నారు. అదే 70 శాతం మందికి నచ్చితే సూపర్ హిట్, 50 శాతం మందికి నచ్చితే హిట్ అవుతుందని, ఇది సినిమా కాలిక్యులేషన్ అని చెప్పారు. 
 
తమ బ్యానరుపై రానున్న "జనక అయితే గనక" చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నామని, అది నచ్చితే బలగం చిత్రం తరహాలో ప్రోత్సహించాలని నచ్చకపోతే విడుదల వరకూ సైలెంట్‌గా ఉండిపోవాలని సరదాగా వ్యాఖ్యానించారు. తమ సినిమా 70 శాతం మందికి నచ్చుతుందని దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు చాలా మంది హంగామా చేస్తారని, రెండో రోజు వసూళ్లు చూసి తమకు నచ్చకపోయినా సినిమా హిట్ అయిందనే అభిప్రాయాన్ని వస్తారన్నారు. అందువల్ల ఒక చిత్రంపై అభిప్రాయాలు మారుతుంటాయని ఆయన పేర్కొన్నారు. 
 
ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్ 
 
'దేవర' చిత్ర దర్శకుడు కొరటాల శివపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కొరటాల శివ ఇపుడు మా కుటుంబ సభ్యుడిగా మారిపోయారు అని అన్నారు. కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర'. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.396 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో చిత్ర సక్సెస్ మీట్‌ను తాజాగా ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించారు. ఇందులో చిత్ర బృందంతో పాటు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'బృందావనం' చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడాయన నా కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. "దేవర-2" చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని అన్నారు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ, నాకు, కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటివారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్