Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ కథే గుణశేఖర్‌ యుఫోరియా

Advertiesment
Gunasekhar's Euphoria team

డీవీ

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (13:21 IST)
Gunasekhar's Euphoria team
శాకుంతల చిత్రం తర్వాత డైరెక్టర్ గుణశేఖర్‌ గ్యాప్ తీసుకుని మరో సినిమాతో ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ రిలీజ్ చేశారు.
 
గుణశేఖర్ మాట్లాడుతూ,  అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్‌గా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. వర్క్ షాపులు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వారినే తీసుకున్నాం. వాళ్లంతా కూడా కథకు కనెక్ట్ అయ్యారు. వారి వారి పాత్రల్లో జీవించేశారు. సినిమాటిక్‌‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్నయూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గుణ శేఖర్ గారి మొదటి చిత్రం లాఠీ. అది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవా, అర్జున్, పా. విజయ్ ల ఫాంటసీ థ్రిల్లర్ అఘతియా ఫస్ట్ లుక్