Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాభై ఏళ్ళ మోసగాళ్లకు మోసగాడు- మ‌ళ్ళీ పద్మాలయా సంస్థలో సినిమాలు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:42 IST)
Mosagaallaku mosagadu
పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ చిత్రం 50సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 27 1971 న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్టామినా అంతర్జాతీయ స్థాయి లో మోత మోగించింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ గారు పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు.
 
మోసగాళ్లకు మోసగాడు 56 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. తమిళ్ లో మోసక్కారన్ కు మోసక్కారన్ ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పెరు తో డబ్బింగ్ చేయబడినది. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింప బడే ది అని ఇటీవల కృష్ణ గారు పలు సందర్భాలలో చెప్పేవారు. వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ మాధవరావు గారి మేకప్ పనితనం ఆదినారాయణ రావు గారు సంగీత ము లో సూపర్ హిట్ పాటలు నేపధ్య సంగీతం ప్రేక్షకులను అభిమానులకు నూతన అనుభూతిని అందించాయి. 
 
హీరోయిన్ విజయనిర్మల గారి తో కృష్ణ గారు కొరినది నెరవేరింది పాట చిత్రీకరణ కోసం డార్జిలింగ్ వెళ్లి చిత్రికరించడం విశేషం. ఈ రోజు తో పద్మాలయా సంస్థ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం .కృష్ణ గారి సాహసోపేత నిర్ణయాలకు వారి సోదరులు హనుమంతరావు అదిశేషగిరి రావు సహకారం తో. విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. అమితాబచ్చన్ రజనీకాంత్ లాంటి అగ్రనటులతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పద్మాలయా. వరుసగా పాతాళ బై రవి మవ్వాలి హిమ్మత్ వాలా 3 సిల్వర్ జూబ్లీ లు నిర్మిచిన ఏకైక దక్షిణ భారత నిర్మాణ సంస్థ పద్మాలయా. దర్శకులు కె రాఘవేంద్రరావు ఈ వి వి సత్యనారాయణ హీరోయిన్స్ శ్రీదేవి సౌందర్య లను హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన సంస్థ.50 వసంతాలు పూర్తి అయింది. 

మ‌ళ్ళీ సినిమాలు
ఈ సందర్భముగా కృష్ణ గారు వారి సోదరులు అది శేషగిరిరావు గారు మాట్లాడుతూ పద్మాలయా సంస్థ మళ్ళీ సినిమా నిర్మాణము చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హనుమంతరావు గారి కుమారులు ప్రసాద్ బాబు నరసయ్య బాబు అదిశేషగిరి రావు గారి కుమారుడు రాఘవ రత్న బాబు సారథ్యం లో సంస్థ ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు తెలియవచ్చిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments