విధి పూరిని మా లైఫ్ లోకి తీసుకొచ్చిందిః విజయ్ దేవరకొండ

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (14:27 IST)
Puri- Vijay
హీరోగా చేస్తున్న త‌న‌ను ఒకేసారి పూరీ ద్వారా విధి ఆయ‌న్ను నా జీవితంలోకి తీసుకువ‌చ్చింద‌ని విజయ్ దేవరకొండ తెలియ‌జేస్తున్నాడు. పూరీ కొడుకు ఆకాష్ న‌టించిన రొమాంటిక్ ప్రీ రిలీజ్ వ‌రంగ‌ల్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా విజ‌య్ పాల్గొన్నాడు. 
 
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నమస్తే వరంగల్ . ఎక్కడెక్కడో ఈ ఈవెంట్ చూస్తున్న అందరికీ బిగ్ హగ్. నేను వచ్చినప్పుడల్లా మీరింత ప్రేమ చూపిస్తే నాకు థాంక్యూ ఎలా చెప్పాలో తెలియదు. నా వైపు నుంచి ఒక్కటే చేయగలుగుతా. మళ్ళీ లైగర్ కి ఇక్కడికి రాగలుగుతా. ఎట్లాగూ పూరి సహా అందరూ ప్రామిస్ చేశారు. మీకు థాంక్యూ చెప్పగలిగే ఒకే విధానం. మళ్ళీ నా ఫంక్షన్ కి ఇక్కడికి రావడమే. ఇక్కడికి వస్తే మొత్తం నా లైగర్ సెట్ కి వచ్చినట్టుంది. అంతా మా లైగర్ టీమ్. వీళ్లంతా చాలా హెల్దీగా, సంతోషంగా ఉండాలి. వీళ్ళెంత హ్యాప్పీగా ఉంటే లైగర్ పనులు అంత వేగంగా జరుగుతాయి. మనస్ఫూరిగా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కేతిక చాలా బాగుంది. సూపర్ ఇంటెలిజెంట్. ఆమె ఎప్పుడు కలిసినా మా కోసం పాడాల్సిందే. కేతిక నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇక మన హీరో ఆకాష్.. అతనిలో ఓ ఫైర్ ఉంది. దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. మీ నాన్న కాలర్ ఎత్తాలి. ఆకాష్ కి సినిమా పిచ్చి చాలా ఎక్కువట. సినిమా బాగా లేకపోయినా చూసి పాజిటివ్‌గానే చెబుతారట. అలాంటి వారు ఉండాలి. ఆకాష్ సక్సెస్ కొడతాడని నమ్ముతున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్, రైటర్లు పూరి గారు ఛార్మి గారంటే నాకు ఇష్టం. మీ అందరికీ ఈ రోజు లైగర్ సినిమా గురించి ఓ క్లారిటీ ఇద్దామనుకున్నా. డెస్టినీ పూరి గారిని మా లైఫ్ లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. లైగర్ సినిమాలోని ఒక్క విజువల్ చూస్తే అది మీకే అర్థమవుతుంది. మేము ఒక్కటే ఫిక్సయ్యాం. 2022లో లైగర్ తో ఇండియాని షేక్ చేయాలె. ఫిక్స్ అయిపోండి. అక్టోబర్ 29న రొమాంటిక్, 2020లో లైగర్‌తో వస్తున్నాం’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments