Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' సెక్యూరిటీని కంగారుపెట్టిన ఫ్యాన్... పవన్ గొప్పమనసు (వీడియో)

పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని అశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇపుడు జనసేన పార్ట

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (08:33 IST)
పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని అశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇపుడు జనసేన పార్టీ అధినేతగా కూడా ఉన్నారు.
 
పవన్ అంటే ప్రాణాలర్పించే ఎంతో కోట్లాది మంది అభిమానులు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇపుడు అలాంటి అభిమానం మరోమారు నిరూపితమైంది. అభిమానులతో అతడు ఎలా ఉంటాడో తెలిపే ఒక అరుదైన సంఘటన తాజా జరిగింది.
 
రాత్రి పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'అజ్ఞాతవాసి' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 
 
అయితే, ఈ కార్యక్రమంలో ఒక పవన్ అభిమాని వేదికపై హల్‌చల్ చేసి, అందరినీ కంగారు పెట్టాడు. మాట్లాడేందుకు పవన్ వేదికపైకి చేరుకోగానే ఓ అభిమాని డైరెక్ట్‌గా వేదిక‌పై వ‌చ్చి ఆయ‌న కాళ్ల‌పై ప‌డ్డారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అభిమానిని అక్క‌డి నుండి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేశారు. 
 
వెంటనే స్పందించిన పవన్.. వారందరిని వారించి వేదికపైనే అభిమానితో మాట్లాడాడు. అంతేకాదు అతడితో ఒక సెల్ఫీకి కూడా ఫోజిచ్చాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ అంటే తమకు ఎందుకు ఇష్టమో ఈ వీడియో చూడండంటూ అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments