Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అజ్ఞాతవాసి' ప్రీ రిలీజ్‌‌‌కు అతిథి 'అన్నయ్య' కాదు.. ఊహించని అతిథి..! (video)

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ

Advertiesment
'అజ్ఞాతవాసి' ప్రీ రిలీజ్‌‌‌కు అతిథి 'అన్నయ్య' కాదు.. ఊహించని అతిథి..! (video)
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:44 IST)
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం జనవరి పదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 18 లేదా 19 తేదీల్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఈ వేడుకకు ఎవరూ ఊహించని అతిథి రానున్నారు. ఈ మేరకు ఆ ఆతిథితో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విదేశాల్లో ఉన్న ఆ అతిథి ఎవరో కాదు... హీరో జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్. 
 
హైదరాబాద్‌లో జరుగనున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌‌కు ముఖ్య అతిథిగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేస్తున్నాడనే వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న తారక్‌కు, త్రివిక్రమ్ ఫోన్ చేశాడని, దానికి తారక్ కూడా ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనడంలో సందేహం లేదు. కాగా, గతంలో త్రివిక్రమ్‌-తారక్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా వేచ్చేసిన విషయం తెలిసిందే.
 
కాగా, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.

ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలయ్యాయి. వాటికి విశేష స్పందన రావడంతో ఈనెల 16 సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ చుట్టూ అల్లిన 'ఉందా? లేదా?'... రివ్యూ రిపోర్ట్