Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#AgnyaathavaasiTeaser : 6PMకు టీజర్ రిలీజ్... 19న ఆడియో ఫంక్షన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్ అందిస్తుండగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా

Advertiesment
#AgnyaathavaasiTeaser : 6PMకు టీజర్ రిలీజ్... 19న ఆడియో ఫంక్షన్
, శనివారం, 16 డిశెంబరు 2017 (13:36 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్ అందిస్తుండగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం టీజర్‌ను శనివారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వదిలిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఆడియో ఫంక్షన్ జరపనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
 
ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ గిటార్ ప్లే చేస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ ఆయన అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ ఆడియో ఫంక్షన్‌కి హైదరాబాద్ - హైటెక్స్ వేదికగా మారబోతున్నట్టు సమాచారం. ఇక ఈ ఫంక్షన్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ భార్య వనిత పారిపోయిందా...? సూసైడ్ చేసుకుందా...?