Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ భార్య వనిత పారిపోయిందా...? సూసైడ్ చేసుకుందా...?

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు గత మూడు రోజులుగా గాలిస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.

Advertiesment
విజయ్ భార్య వనిత పారిపోయిందా...? సూసైడ్ చేసుకుందా...?
, శనివారం, 16 డిశెంబరు 2017 (12:30 IST)
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు గత మూడు రోజులుగా గాలిస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. తన భర్త హత్య కేసులో తనను అరెస్టు చేయడం తథ్యమని భావించడంతో వనితా రెడ్డి పారిపోయిందా? లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఆమె ఆచూకీ కోసం గత మూడు రోజులుగా గాలిస్తున్నా కనీసం చిన్నపాటి క్లూను కూడా కనిపెట్టలేక పోతున్నారు. దీంతో ఆమె జీవించేవుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, వనితా రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు మాత్రం ఆమె నివాసంతో పాటు మరికొన్ని చోట్ల గట్టి నిఘాపెట్టారు. 
 
అయితే విజ‌య్ ఆత్మహత్యకు ముందు ఫోన్‌లో వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఆమెపై అనుమానాల‌కు తావిస్తోంది. ప‌గ‌తీర్చుకుంటాన‌ని బెదిరించ‌డం, అంతుచూస్తాన‌న‌డం వంటి మాట‌లు విజ‌య్‌ని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించేలా ఉన్నాయి. అలాగే విజ‌య్ సెల్ఫీ వీడియో సాక్ష్యం ఆధారంగా పోలీసులు ఆమెను నిందితురాలిగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. 
 
భర్త చనిపోయిన తర్వాత ఒక్కసారి మీడియాకు కనిపించిన ఆమె.. ఆ తర్వాత కంటికి కనపించలేదు. భర్త అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. ఇంతలో ఆమె భర్తను బెదిరించిన ఆడియో క్లిప్ లీక్ కావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సూర్యాపేటలో వనిత ఉందనీ చెప్పినప్పటికీ వనిత ఫోన్ సిగ్న‌ల్స్ రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉండ‌టం స‌రిపోల‌క‌పోవ‌డంతో గాలింపు చ‌ర్య‌ల‌ను పోలీసులు మ‌రింత ముమ్మరం చేసిన‌ట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెయింటర్‌గా మారిన హీరోయిన్ (హాటెస్ట్ ఫోటోలు)