Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ సాయికి కుందన అంటే ప్రాణం.. వనిత వేధింపులే: సుబ్బారావు

ఆత్మహత్యకు పాల్పడిన కమెడియన్ విజయ్ సాయి తండ్రి సుబ్బారావు తన కోడలు వనిత మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా మీడియా ముందు చూపెట్టారు. భారీ మొత్తాన్ని డిమాండ్ చ

Advertiesment
విజయ్ సాయికి కుందన అంటే ప్రాణం.. వనిత వేధింపులే: సుబ్బారావు
, శనివారం, 16 డిశెంబరు 2017 (11:00 IST)
ఆత్మహత్యకు పాల్పడిన కమెడియన్ విజయ్ సాయి తండ్రి సుబ్బారావు తన కోడలు వనిత మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా మీడియా ముందు చూపెట్టారు. భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడమే కాకుండా.. విజయ్ సాయిని చంపేస్తామని ఎవరితోనూ బెదిరించేలా చేసిందని.. వనిత వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుబ్బారావు అన్నారు.
 
అంతేగాకుండా వనిత వున్నట్టుండి ఎక్కడి వెళ్లిపోయిందని ప్రశ్నించారు. ఇప్పటివరకు విజయ్ సాయి వేధింపులతోనే అతనికి దూరమయ్యానని చెప్పుకుంటూ వచ్చిన వనిత ప్రస్తుతం ఎందుకు కనిపించకుండా పోయిందని విజయ్ సాయి తల్లిదండ్రులు ప్రశ్నించారు. చెట్టంత బిడ్డను కోల్పోయిన తాము ఎవరి కోసం బతకాలని విజయ్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
కుమార్తె కుందన అంటే విజయ్‌కి ప్రాణమని.. ఎప్పుడూ కూతురుతోనే సమయాన్ని గడిపేవాడని విజయ్ తల్లి చెప్పారు. లేక లేక పుట్టిన బిడ్డని విజయ్ సాయిని గారాబంగా పెంచుకున్నామని.. తమ పట్ల అతడు బాధ్యతగా వ్యవహరించాడని.. చెల్లెలు, సోదరుడి పెళ్లి చేశాడని తెలిపారు. అలాంటి బిడ్డ తమకు ఇకలేదంటే ఎలా జీర్ణించుకోగలమని వెల్లడించారు. విజయ్ సాయి ప్రేమించిన వనితతో పెళ్లి జరిపించామని.. అలా ప్రేమించి పెళ్లి చేసుకుని.. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని విజయ్ సాయి తల్లిదండ్రులు రోదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ గాంధీకి నేడే పట్టాభిషేకం...