Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ హాస్టల్ కథలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా 'ఉందా? లేదా?'

2017 సంవత్సరం చివరి నెలకావడంతోపాటు మొదటివారం పెద్ద చిత్రాల ధాటికి తట్టుకోలేకపోవడంతో తెలుగులో చిత్రమైన పరిస్థితి నెలకొంది. అందుకే తక్కువ బడ్జెట్‌ చిత్రాలు శుక్రవారం రోజున దాదాపు 15 సినిమాలు విడుదలయ్యాయ

Advertiesment
Unda Leda Movie Review
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (08:39 IST)
నటీనటులు : రామకష్ణ, అంకిత, కుమార్‌ సాయి, జీవా, రామ్‌జగన్‌ ,ఝూన్సీ, ప్రభావతి తదితరులు
 
సాంకేతికత:  
బ్యానర్‌ : జయకమల్‌ ఆర్ట్స్‌
ఎడిటర్‌ : మణికాంత్‌ తెల్లగూటి
కొరియోగ్రఫీ: నందు  జెన్నా
పాటలు :నాగరాజు కువ్వారపు, శేషు మోహన్‌
సింగర్స్‌ : సింహ, హేమచంద్ర, స్వీకర్‌ అగస్సీ
మ్యూజిక్‌ : శ్రీమురళీ కార్తికేయ 
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్‌ కె బంగారి
సహానిర్మాతలు : అల్లం సుబ్రమణ్యం.,అల్లం నాగిశెట్టి
నిర్మాత : అయితం ఎస్‌.కమల్‌ 
దర్శకత్వం : అమనిగంటి వెంకట శివప్రసాద్‌.
 
2017 సంవత్సరం చివరి నెలకావడంతోపాటు మొదటివారం పెద్ద చిత్రాల ధాటికి తట్టుకోలేకపోవడంతో తెలుగులో చిత్రమైన పరిస్థితి నెలకొంది. అందుకే తక్కువ బడ్జెట్‌ చిత్రాలు శుక్రవారం రోజున దాదాపు 15 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 'ఉందా? లేదా?' అనేది ఒకటి. పూర్తిగా విజయవాడ, ఆ పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
విజయవాడ నగరంలో రాజా హరిశ్చంద్ర మహిళా వసతి గృహం. అందులో వరుసగా ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరి పేరు రుబియా. తను ఉరివేసుకునేముందు పట్టుచీర, కాళ్ళకు పారాణి పెట్టుకుంటుంది. దీన్ని పరిశోధించే పోలీసు ఆఫీసర్‌ రామ్‌జగన్‌. ఎక్కడా క్లూ కూడా దొరక్కపోవడంతో మీడియా ఒత్తిడి, హోంమంత్రి నుంచి మాటలు పడలేక... ఓ ప్రైవేట్‌ వ్యక్తి అయిన రామకృష్ణతో హాస్టల్‌పై షార్ట్‌ఫిలిం తీయమని రామ్‌జగన్‌ కోరతాడు. తను ఎలాగైనా సినిమా తీయాలని కలలుకంటున్న రామకృష్ణ దాన్ని నిరాకరిస్తాడు. కానీ తను ప్రేమించే అంకిత అక్కడే ఉండడంతో తనకు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడంతో రామకృష్ణ హాస్టల్‌పై దృష్టిసారిస్తాడు. ఆ తర్వాత అతడు ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఇందులో నటించినవారంతా కొత్తవారే. అంకిత అనే అమ్మాయి పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. హీరో హీరోయిన్లు ఓకే అనిపిస్తారు. రామ్‌జగన్‌ పోలీసు ఆఫీసర్‌గా ఫర్వాలేదు. ఇటీవల సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ఆదరణ వున్న దృష్ట్యా సింపుల్‌గా సినిమా తీయవచ్చనే ఫార్మెట్‌తో చాలా మంది వస్తున్నారు. ఆ కోవలోనిదే ఈ సినిమా. చాలా పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో పారా సైకాలజీ, ఆత్మలు వున్నాయా? లేదా? అనే దాన్ని దర్శకుడు టచ్‌ చేశాడు. ఆ క్రమంలో భయపెట్టాలనుకున్నాడు. కానీ ఇలాంటి చిత్రాలు గ్రాఫిక్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్ని భయపెట్టాయి. టెక్నాలజీని పెద్దగా ఉపయోగించకుండా పరిమితి వనరులతో చేసిన ప్రయత్నమిది. అయితే స్క్రీన్‌పై చెప్పే విధానంలో ఇంకాస్త ఇంట్రెస్ట్‌గా చూపిస్తే బాగుండేది. 
 
రామకృష్ణ హాస్టల్‌లో షార్ట్‌ ఫిలిం తీయడానికి వచ్చినప్పుడు అక్కడ వార్డెన్‌ అనుమతి కూడా తీసుకోకుండా నేరుగా తన టీమ్‌తో వచ్చేస్తాడు. ఆత్మల్ని బయటకు రప్పించడానికి సాయి చదరంగంలాంటి దాన్ని తీసుకువచ్చినప్పుడు కేవలం నలుగురే హాస్టల్‌లో ఉంటారు. అందరూ ఖాళీచేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో అంకిత నిద్రవస్తుందంటూ వెళ్ళిపోతుంది. ఆమెను అలా ఒంటరిగా వదలిన సన్నివేశాన్ని ఇంకాస్త వివరంగా తీయాల్సింది. కానీ, తొలిసారిగా విజయవాడ బేస్డ్‌ కథను తీసుకుని చేయడం విశేషమే. పూర్తిగా అక్కడే తీసిన చిత్రమిది. ఇక హోంమంత్రిణిగా ఝాన్సీ నటించింది. 
 
ఇందులో ప్రత్యేకంగా దర్శకుడు నేటి రాజకీయనాయకుల కుటిలతత్త్వాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. రాజా హరిశ్చంద్ర ట్రస్ట్‌కు 2 వేల ఎకరాలు, కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇతర ఆస్తులుంటాయి. వాటిని ఏదోవిధంగా కైవసం చేసుకోవాలని హోమంత్రి ఝాన్సీ కన్నేస్తుంది. దీంతో అక్కడ దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయనీ భయపెట్టి ఇద్దరు చావుకు కారణమవుతుంది. దీంతో ఆమెకు తగిన శాస్తి చేయడం చిత్ర ముగింపు. ఇలాంటి కథను వర్తమాన పరిస్థితుల కనుగుణంగా రాసుకుని తనకు తగిన సృజనాత్మకతను దర్శకుడు ప్రదర్శించాడు. సినిమాటోగ్రఫీ ఓకే. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సాయితో హీరో చేసే సన్నివేశాలు కొంత హాస్యాన్ని ఇస్తాయి. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం ఫర్వాలేదు. అయితే దర్శకుడు ఊహించని మలుపులతో ఈ చిత్రాన్ని తీస్తే మరింత బాగుండేది. మొత్తంగా ఇలాంటి కథల్ని ఆదరించే వారికి టైంపాస్‌ మూవీ.
 
రేటింగ్‌: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్డి కులాన్ని టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ... అంతా బయటపెడ్తాడట...