Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ల్మాన్‌ఖాన్ `రాధే`లో సీటీమార్ సాంగ్ చేసిన డిఎస్‌పి.

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:45 IST)
Seetimar song salman
తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాధించిన విజ‌యాలు అంద‌రికీ తెలిసిందే. జాతీయ‌స్థాయిలో బెస్ట్ పాపుల‌ర్ ఫిలిం అవార్డ్ అందుకున్న`మ‌హ‌ర్షి` చిత్రానికి త‌న మ్యూజిక్‌తో ప్రాణం పోశారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. అలాగే క‌రోనా క్రైసిస్‌లో కూడా జ‌నం ఉప్పెన‌లా థియేట‌ర్ల‌కు త‌ర‌లిరావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం `ఉప్పెన` చిత్రానికి  దేవిశ్రీ అందించిన పాట‌లే. రానున్న పాన్ఇండియా మూవీ పుష్పకి హై ఎక్స్‌పెక్టేష‌న్స్ రావ‌డానికి రాక్‌స్టార్ కూడా ఒక కార‌ణం. అలాగే రామ్ లింగుసామి కాంభినేష‌న్ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్‌ ఎంట్రీతో ఒక కొత్త ఊపువ‌చ్చింది. వీటితోపాటు ఎఫ్‌3, ఖిలాడి సినిమాల‌కి దేవిశ్రీ సంగీతం మంచి ఎసెట్ కానుంది. ఇటు త‌మిళ్‌లో అంద‌రి హీరోల‌తో అద్భుత‌మైన హిట్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా జీత‌మిళ్‌లో ప్ర‌సారం అవుతున్న `రాక్‌స్టార్` షోతో త‌మిళ‌నాట త‌న ఇమేజ్‌ని మ‌రింత రెట్టింపు చేసుకున్నారు దేవి. 
 
DSP with salman, prabhu
తాజాగా స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రాధే చిత్రానికి సీటీమార్‌ సాంగ్‌తో దేశ‌మంతా చెప్పు‌కునేలా స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. దేవి కంపోజ్‌ చేసిన సీటీమార్ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.. ఈ పాట ఎంతో న‌చ్చ‌డంతో త‌న `రాధే` సినిమాలో ఈ పాట‌ను మ‌ళ్లీ చేయ‌మ‌ని స‌ల్మాన్ ఖాన్ ప‌ర్స‌న‌ల్‌గా అడగ‌డం విశేషం. మే13న విడుద‌ల‌వుతున్న స‌ల్మాన్‌ఖాన్ రాధేలో దేవిశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచిన‌ సీటీమార్ సాంగ్ ఒక స్పెష‌ల్ హైలెట్ కాబోతుంది. ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్‌లో రెండు ప్ర‌స్టీజియ‌స్ మూవీస్‌కి దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సైన్ చేశారు. సీటీమార్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సాంగ్‌తో స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌శంస‌లందుకున్న రాక్‌స్టార్ రానున్న కాలంలో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్‌లో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

ACB: మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట... షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Amoeba: మెదడును తినే అమీబా.. కేరళలో 20మంది మృతి

కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు

బంగారు పీఠం తప్పిపోయింది.. ఉన్ని కృష్ణన్ ఇంట్లో దొరికింది.. అసలేం జరుగుతోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments