Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోలే జావో ఎవరు.. ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారట!

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:39 IST)
Chloé Zhao
సినీ పరిశ్రమలో అత్యుత్తమ అవార్డులుగా భావించే ఆస్కార్ అందుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. దీని కోసం నిద్రలేని రాత్రలు కూడా గడుపుతుంటారు. అయితే ఈ సారి ఎవరు ఊహించని విధంగా చోలే జావో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. 
 
డేవిడ్‌ ఫించర్‌, థామస్‌ వింటెబెర్గ్‌, లీ ఐసాక్‌ చంగ్‌ వంటి పురుష దర్శకులను దాటి ఉత్తమ దర్శకత్వ విభాగంలో చోలే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకోవడంతో ఈ బీజింగ్ నటి గురించి అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
చోలే జావో తొలిసారి ఆస్కార్ గెలుచుకున్న ఆసియన్ మహిళా దర్శకురాలిగా చరిత్ర సృష్టించగా, ఈమె బీజింగ్‌లో పుట్టింది. తండ్రి చైనాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త. చైనీస్ దర్శకుడు వాంగ్ కార్ వై చిత్రాలను అమితంగా ఇష్టపడే ఈమె న్యూయర్క్‌లో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కోర్సు చేసి.. 'సాంగ్స్‌ ఆఫ్‌ మై బ్రదర్స్‌ టాట్‌ మీ' చిత్రంతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు.
 
'సాంగ్స్‌ మై బ్రదర్స్‌ టాట్‌ మి', 'ది రైడర్‌'తో అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న చోలే జావో ఇప్పుడు 'నోమ్యాడ్‌ ల్యాండ్‌'తో అందరి దృష్టిని ఆకర్షించింది. నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ అందుకోవడంతో పాటు పలు విభాగాలలోను దక్కించుకుంది. ఈమె కోసం గూగుల్‌లో నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments