Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిత్య మ్యూజిక్ 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్లో చేరిన సారంగ‌ద‌రియా

Advertiesment
ఆదిత్య మ్యూజిక్ 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్లో చేరిన సారంగ‌ద‌రియా
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:02 IST)
Saraga dariya song
టాలీవుడ్ లో ఎవ‌ర్ గ్రీన్ స‌క్సెస్ ఫుల్ ఫార్మూలా ఏదంటే పాట‌లు బాగుంటే జనాలు ఆటోమెటిక్ గా సినిమా చూడ‌టానికి థియేటర్ కి వ‌స్తారు. తెలుగు ప్రేక్ష‌కులు మ్యూజిక్ కి చాలా ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న అన్ని సినిమాలు ఆడియోలు కూడా ప్రేక్ష‌కాధ‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. తాజాగా ఉప్పెన స‌క్సెస్ లో ఈ సినిమా క‌థ‌తో పాటు పాట‌లు కూడా కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఉప్పెన ఆడియోలో అన్ని పాట‌ల్ని ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రించారు. ఇదే ఆల్బ‌మ్ లో ఉన్న నీ క‌ళ్లు నీలి స‌ముద్రం పాట‌కు 204 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం.

ఇదే రీతిన ఆదిత్య వారు గ‌తంలో అందించిన చాలా సూప‌ర్ హిట్ సినిమాల‌కి సంబంధించిన ఆడియోల్లోని పాటుల‌కు వంద‌ల మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ అల‌వైకుంఠ‌పురంలోని బుట్టు బొమ్మ పాట‌కు 575 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇదే ఆల్బమ్ లో ఉన్న సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట 173 మిలియ‌న్లు, రాములో రాములో పాట 353 మిలియ‌న్స్ వ్యూస్ అందుకున్నాయి. అంతేకాదు యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత‌గోవిందం ఆడియోకు 100 మిలియ‌న్స్ వ్యూస్ ద‌క్కించుకున్నాయి. వీటి స‌ర‌సన లేటెస్ట్ చాట్ బ‌స్ట‌ర్, సారంగ‌ద‌రియా వ‌చ్చి చేరింది,

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న ల‌వ్ స్టోరీ సినిమా ఆడియోలో ఉన్న సారంగ‌ద‌రియా పాట ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా విడుద‌లైన అతి కొద్ది స‌మ‌యంలోనే ప్రేక్ష‌కాధ‌ర‌న అందుకోవ‌డం ఆ వెంట‌నే అతి త‌క్కువ రోజుల్లో దాదాపుగా 101 మిలియన్ల వ్యూస్ తో ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ లో చేర‌డం విశేషం. గ‌తంలో వ‌రుణ్ తేజ్, సాయిప‌ల్ల‌వి, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో వ‌చ్చిన ఫిదా మూవీ ఆడియోని కూడా ఆదిత్య మ్యూజిక్ వారే విడుద‌ల చేశారు. ఫిదా ఆడియోలోని వ‌చ్చిండే పాట కూడా  ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ చోటు ద‌క్కించుకుంది.
 
ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై 100 మిలియ‌న్లు పైన వ్యూస్ ద‌క్కించుకున్న పాటల వివ‌రాలు
 
అల‌వైకుంఠ‌పురంలో - బుట్ట‌బొమ్మ - 575 మిలియ‌న్లు
 
అల‌వైకుంఠ‌పురంలో - రాములో రాముల - 353 మిలియ‌న్లు
 
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (లిరిక‌ల్ సాంగ్) - 227 మిలియన్లు
 
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (ఫుల్ సాంగ్) - 173 మిలియ‌న్లు
 
ఫిదా - వ‌చ్చిందే - 295 మిలియ‌న్లు
 
ఉప్పెన - నీ క‌ళ్లు నీలి స‌ముద్రం - 204 మిలియ‌న్లు
 
డీజే - సీటిమార్ - 202 మిలియ‌న్లు
 
ఛ‌లో - చూసి చూడంగానే - 169 మిల‌యిన్లు
 
ఎమ్ సి ఏ - ఏవండోయ్ నాని గారు - 118 మిలియ‌న్లు
 
గీత గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (వీడియో ఎడిట్ వెర్ష‌న్) - 115 మిలియ‌న్లు
 
గీత‌గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (లిరిక‌ల్) - 108 మిలియ‌న్లు
 
గీత‌గోవిందం - వ‌చ్చింద‌మ్మ - 108 మిలియ‌న్లు
 
గీత‌గోవిందం - ఏంటి ఏంటి - 102 మిలియ‌న్లు
 
ల‌వ్ స్టోరీ - సారంగ‌దరియ - 101 మిలియ‌న్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వకీల్ సాబ్‌'కు కరోనా కష్టాలు - విడుదల వాయిదా?