Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనసభలో ఎమ్మేల్యే నారాయణస్వామిగా డా.రాజేంద్రప్రసాద్

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (18:31 IST)
Dr. Rajendra Prasad
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గారు ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. 
 
మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. చిత్రం కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవేందర్ రెడ్డి, సంగీతం: రవిబసుర్, ఆర్ట్: కేవీ రమణ, కెమెరా: మురళీకృష్ణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments