Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో 4 వేల పులులు ఉండొచ్చు.. కానీ ద్రవిడ్ ఒక్కడే : రాస్ టేలర్

Advertiesment
ross taylor
, ఆదివారం, 14 ఆగస్టు 2022 (16:03 IST)
ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన జీవిత చరిత్రను బ్లాక్ అండ్ వైట్ అనే పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 
 
న్యూజిలాండ్ క్రికెట్‌లో వివక్ష, రాజస్తాన్ రాయల్స్ యజమాని తనను కొట్టడం వంటి విషయాలతో ఈ పుస్తకం ఇప్పటికే సంచలనాలను సృష్టిస్తుండగా తాజాగా టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో తన అనుబంధానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
 
ఈ పుస్తకంలో 'ఒకసారి ద్రావిడ్‌తో మీరు ఇదివరకు ఎన్నిసార్లు పులిని చూశారని అడిగా. దానికి ద్రావిడ్ "నేను పులిని చూద్దామని 21 సార్లు అడవిలో యాత్రకు వెళ్లా. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు" అని అన్నాడు. ఆ మాట విని నేను షాకయ్యా. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకసారి ద్రావిడ్‌తో కలిసి రాజస్తాన్‌లోని ఓ నేషనల్ పార్కుకు వెళ్లాం. అక్కడ టీ-17 అని ట్యాగ్ చేసిన పులి కనిపించింది. దానిని చూసి ద్రావిడ్ చాలా థ్రిల్‌గా ఫీలయ్యాడు..
 
పులిని చూడటం కంటే అక్కడ నాకు మరో విషయం ఆశ్చర్యకరంగా అనిపించింది. మేము పులిని చూసేందుకు ఓపెన్ టాప్ ఎస్‌యూవీ ఎక్కాం. ఆ వాహనం ల్యాండ్ రోవర్ కంటే కొంచెం పెద్దది. మేమంతా పులిని చూస్తుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు మాత్రం తమ కెమెరాలను ద్రావిడ్ వైపునకు తిప్పారు. అడవిలో పులిని చూసిన ఆనందం కంటే వాళ్లు ద్రావిడ్‌ను చూసినందుకు ఎక్కువ సంతోషపడుతున్నారు. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల పులులు ఉంటాయోమో గానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడే…'' అని టేలర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.
 
ద్రావిడ్-టేలర్‌లు 2008 నుంచి 2011 వరకు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడగా 2011 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క టూర్ కోసం భారత క్రికెట్ జట్టు కోచ్‍‌గా వీవీఎస్ లక్ష్మణ్