Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్త‌వ క‌థ‌తో ప్రభుత్వ జూనియర్ కళాశాల

Pranav Singampally
, శనివారం, 13 ఆగస్టు 2022 (16:52 IST)
Pranav Singampally
ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆ వాస్తవ కథను తెరకెక్కించారు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించారు . అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాతగా మాకు  ఇది మొదటి సినిమానే అయినా అంతా తానై  చూసుకున్నాడు దర్శకుడు. నటీనటులు  కొత్తవారు అయినా వారి  నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. మాకు ఆయన మార్గ దర్శకుడిలా మారిపోయారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం గారికి "ప్రభుత్వ జూనియర్ కళాశాల" సినిమా టీమ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించబోతున్నాం అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన పాటలు అందించారు. అన్ని పాటలు చక్కగా కుదిరాయి. మా సినిమాలో 4 పాటలు ఉంటాయి, ఒకపాట ప్రముఖ గాయని చిన్మయి గారు, ఇంకో పాట ప్రముఖ గాయకులు విజయ్ ఏసుదాస్ గారు పాడారని తెలియజేసారు నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి. అంతేకాకుండా ఈ పాటలకు ప్రముఖ లిరిసిస్ట్ సాయి కిరణ్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించగా సయ్యద్ కమ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అందజేశారు.
 
బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు కార్తిక్ రోడ్రిగ్జ్ సంగీతం సమకూర్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సయ్యద్ కమ్రన్ చేస్తున్నారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ గా బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌ గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామనీ, ఈ సినిమా ప్రేక్షకులందరకీ కొత్త ఫీల్ని కల్గించనుంది అని దర్శకనిర్మాతలు అంటున్నారు. చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెప్పించే కార్తికేయ 2 - రివ్యూ రిపోర్ట్‌