బిగ్ బాస్ మూడో సీజన్.. విన్నర్ ఎవరో చెప్పేసిన వితిక.. ఎవరో తెలుసా? (video)

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (15:10 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానుంది. ప్రస్తుతం బిగ్ బాస్‌లో ఐదుగురు కంటిస్టెంట్స్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, అలీ రెజాలు వున్నారు. ఆదివారం అనూహ్యంగా శివజ్యోతి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బిగ్ బాస్ 3 హౌజ్‌లో ప్రముఖ యాంకర్ సుమ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
 
సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులతో సుమ భలే నవ్వులు పూయించారు. ఇక బిగ్ బాస్3 విన్నర్ ఎవరో చెప్పేస్తుంది నటి వితిక. బిగ్ బాస్ విన్నర్ తన భర్త వరుణ్ సందేశ్ అని బల్లగుద్ది మరీ చెబుతుంది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా, తనకంటే వరుణ్ ఎంతో బాగా ఆడాడని వ్యాఖ్యానించింది.
 
వరుణ్ సోలోగా ఉంటే మరింత బాగా ఆడతాడని తాను బయటకు వచ్చిన తరువాత చాలామంది చెప్పారని, అందువల్ల తాను ఎలిమినేట్ అయినందుకు బాధపడటం లేదని చెప్పింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో తాను ఉన్నపుడు కిచెన్ సామ్రాజ్యానికి తానే రాణి అని చెప్పుకొచ్చింది. ఫైనల్‌లో వరుణ్ గెలిస్తే.. విన్నర్ ప్రైజ్ రూ. 50 లక్షలను భద్రంగా దాచుకుంటామని చెప్పింది.
 
తమ వివాహం జరిగిన చాలాకాలం పాటు ఎన్నో కష్టాలు పడ్డామని వితిక వెల్లడించింది. ఇప్పుడు డబ్బులు వస్తే.. దాన్ని ఫిక్సెడ్ చేసుకుంటామని వ్యాఖ్యానించింది. అయితే వరుణ్ సందేశ్‌కి బిగ్ బాస్ హౌజ్‌లో గట్టిపోటీ ఇచ్చేది మాత్రం శ్రీముఖి, రాహులేనని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments