Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వితికా షెరు ఎలిమినేషన్.. భావోద్వేగానికి గురైన వరుణ్ సందేశ్

వితికా షెరు ఎలిమినేషన్.. భావోద్వేగానికి గురైన వరుణ్ సందేశ్
, సోమవారం, 21 అక్టోబరు 2019 (10:14 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి వితికా షెరు ఎలిమినేట్ అయ్యింది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో వరుణ్ సందేశ్, వితికా షేరు, అలీరెజా నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌కు పెద్ద టాస్కే వచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి.. ఛార్మి నటించిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలోని పాటకు డాన్స్ చేసింది.
 
మరోవైపు వితికా షేరు.. ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలోని అగ్గిపుల్ల లాంటి పాటకు డాన్స్ చేస్తే.. రాహుల్ .. ముఠామేస్త్రీ లోని టైటిల్ సాంగ్‌కు చిందేసాడు. శివజ్యోతి కూడా చందమామ పాటకు డాన్స్ చేసింది. అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌ తమకిచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు. ఇంకోవైపు కళ్లకు గంతలు కట్టుకొనే టాస్క్‌లో వితికా, వరుణ్ సందేశ్ బాల్స్‌తో ఆడుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
ఇక అలీ రజా, రాహుల్ కళ్లకు గంతలతో ఒకరినొకరు గుద్దుకున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లకు గంతలు కట్టుకొని ఈ స్కిట్స్ చేసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముగ్గురిలో వితికా షేరు, వరుణ్ సందేశ్, అలీ రెజాల్లో ముందుగా అలీ రెజా సేఫ్ అయ్యాడు. ఇక భార్యాభర్తలైన వరుణ్ సందేశ్, వితికా షేరుల్లో చివరికి వితికా షేరును ఎలిమినేట్ చేసాడు బిగ్‌బాస్. వితికా షేరు ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ భావోద్వేగానికి గురయ్యాడు.
 
వరుణ్‌ను చూసి వితిక కూడా ఏడ్చేసింది. 'మా ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి' అంటూ మిగిలిన కంటెస్టెంట్లకు చెప్పి వరుణ్‌కు కిస్ ఇచ్చి వెళ్లిపోయింది వితిక. ఆ తరవాత స్టేజ్ మీదికి వచ్చిన వితికాకు తన జర్నీ మొత్తాన్ని చూపించారు నాగార్జున. ఈ 90 రోజుల్లో ఇన్ని ఎమోషన్స్ తాను ఫీలయ్యానని స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియలేదని వితిక అంది. చివరిగా బిగ్ బాంబ్‌ను రాహుల్‌పై వేసింది. ఈ బాంబ్ ఏంటంటే.. బిగ్ బాస్ ఆపమని చెప్పేంత వరకు ఇంట్లోని బాత్‌రూంలు అన్నింటినీ రాహుల్ ఒక్కడే క్లీన్ చేయాలి.
 
కాగా ఈ ఆదివారంతో బిగ్‌బాస్‌ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. పదమూడో వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా 'టాపర్‌ ఆఫ్‌ ది హౌస్‌' టాస్క్‌ను నిర్వహించగా, అది కాస్తా పక్కదారి పట్టి, వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. దీంతో హౌస్‌లోని వారందరినీ నామినేట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వింత వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ కేథరిన్ థ్రెసా