Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-10-2019 రాశి ఫలితాలు... జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం కష్టం

16-10-2019 రాశి ఫలితాలు... జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం కష్టం
, బుధవారం, 16 అక్టోబరు 2019 (09:00 IST)
మేషం: స్త్రీలు ప్రతి విషయంలో అతిగా వ్యవహరించడం మంచిదికాదని గ్రహించండి. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుగుణంగానే ఉంటాయి. ఖర్చులు అధికం. బంధువుల ఆకస్మిక రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం: ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ విరోధులు కూడా మీ సహాయం ఆర్థిస్తారు. 
 
మిధునం: రాజకీయనాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్ధేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ సంతానం చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కానబరుస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని ప్రయాణాలు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. 
 
సింహం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. దుబారా ఖర్చులు అధికం. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసమపోగలవు.
 
కన్య: మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములరావచ్చు. జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. వారసత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
తుల: ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నదైనా మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి తప్పవు.
 
వృశ్చికం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. వృత్తియందు, వ్యాపారముల యందు మంచి లాభములు గడిస్తారు. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. 
 
మకరం: మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినివ్వగలదు. ప్రింటింగు, స్టేషనరీ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. మీరు చేసే ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు.
 
కుంభం: ఆర్థిక ఇబ్బంది తొలగి, మానసికంగా కుదుటపడతారు. ఫైనాన్స్, చిట్‌‌‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. 
 
మీనం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు పంచుకోనే వారి కోసం మనసు తహతహలాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజలు, వ్రతాలు, శాంతులు ఎందుకో తెలుసా?