Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19-09-2019 గురువారం రాశిఫలాలు - మితంగా సంభాషించడం వల్ల...

webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (07:21 IST)
మేషం: కోర్టు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. పూర్వ మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
 
వృషభం: వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి సామాన్యం. షేర్ల కొనుగోళ్ళు లభిస్తాయి.
 
మిధునం: ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసివస్తుంది. ప్రభుత్వోద్యోగులకు దీర్ఘకాలిక సెలవు, లోన్లు మంజూరుకాగలవు. రుణం ఏ కొంతైనా తీర్చగల్గుతారు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాకపోవటంతో నిరుత్సాహం చెందుతారు. కార్యసాధనలో పట్టు, ఓర్పు ముఖ్యమని గమనించండి. క్రయ విక్రయాలు సామాన్యం.
 
కర్కాటకం: మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. అయిన వారికి ఆపత్సమయంలో అండగా నిలుస్తారు. దైవ కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
సింహం: విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీ, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.
 
కన్య: స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. ఇతరులకు పూర్తి బాధ్యతలు అప్పగించటం మంచిది కాదని గమనించండి.
 
తుల: స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మిమ్ములను ఆందోళనకు గురిచేసిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తులకు తోటి వారి మాట, ధోరణి కారణంగా మానసిక ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం: మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. బ్యాంకులలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ వహించండి.
 
ధనస్సు: విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ మాటకు గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగ విరమణ చేసే వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు ఆందోళన కలిగిస్తాయి.
 
మకరం: భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. దైవ, పుణ్య, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి. ధనం ఎంత సంపాదించినా నిలువ చేయలేరు.
 
కుంభం: ప్లీడర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.
 
మీనం: ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులౌతారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఆకస్మిక ధన, వస్త్రప్రాప్తి వంటి శుభసూచనలున్నాయి. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

గన్నేరుతో శివునికి, గణపతికి పూజ చేస్తే..? పాదరస గణపతిని..?!