Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (08:24 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ తన సతీమణి, సినీ నేపథ్య గాయని సైంధవికి విడాకులు ఇవ్వడానికి యువ హీరోయిన్ దివ్యభారతే ప్రధాన కారణమంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై దివ్యభారతి స్పందించారు. జీవీ ప్రకాష్ దంపతులు విడిపోవడానికి కారణం తాను కాదన్నారు. పైగా, జీవీ ప్రకాష్‌తో తాను డేటింగ్ చేయడం లేదని స్పష్టంచేశారు. 
 
తనకెలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లో తన పేరును లాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవీ ప్రకాష్ కుటుంబ సమస్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, ముఖ్యంగా, వివహితులతో అసలు డేటింగ్ చేయనని ఆమె స్పష్టంచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దని విజ్ఞప్తిచేశారు 
 
నిజానికి ఈ విషయంపై స్పందించాలని తాను అనుకోలేదని కానీ, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తన సహనాన్ని పరీక్షిస్తున్నాయని, ఈ ప్రచారం వల్ల ఇండస్ట్రీలో తన పేరు చెడిపోతుందని, అందుకే తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments