Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

Advertiesment
cyber crime

ఠాగూర్

, ఆదివారం, 30 మార్చి 2025 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పరాయి మహిళ తోడు కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం డేటింగ్ యాప్‌ ద్వారా అప్రోచ్ అయ్యాడు. తనకు పరిచయమైన మహిళ చెప్పిన మాటలు నమ్మి ఏకంగా రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థకు డైరెక్టర్ అయిన దల్జీత్‌ సింగ్ భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఓ డేటింగ్ యాప్ ద్వారా అనిత అనే ఓ మహిళ పరిచయమైంది. కొంతకాలానికే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 
 
దల్జీత్ తన మాటలను పూర్తిగా నమ్ముతున్నాడని నిర్ధారించుకున్నతర్వాత ఆమె తన పథకం అమలు చేసింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అనితికాలంలోనే మంచి లాభాలు గడించవచ్చని ఆశ చూపించింది. వెంటనే మూడు వెబ్‌సైట్ల పేర్లను కూడా సూచించింది. అలా ఆమె చెప్పిన మూడు కంపెనీల్లో రూ.3.2 లక్షలు చొప్పున పెట్టుబడిగా పెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయనకు రూ.24 వేలు లాభం వచ్చింది. 
 
దీంతో అనిత మాటలపై దల్జీత్‌కు నమ్మకం మరింత రెట్టింపు అయింది. ఇంకేముంది.. తాను దాచుకున్న రూ.4.5కోట్ల సేవింగ్స్‌తో పాటు మరో రూ.2 కోట్లు అప్పు చేసిమరీ పెట్టుబడిగా పెట్టారు. అలా ఆయన రూ.6.5 కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆమె సూచిన ఆ మూడు వెబ్‌సైట్లు డౌన్ అయిపోయాయి. అటు అనిత మొబైల్ కూడా స్విఛాఫ్ అయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య