Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

Advertiesment
suicide

ఠాగూర్

, ఆదివారం, 30 మార్చి 2025 (11:54 IST)
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బజారులో బంగారం వ్యాపారి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతుల కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భవనేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురూ ఇంట్లో విగతజీవులుగా పడివుండటాన్ని స్థానికులు గుర్తించారు. కుమారుల్లో సంతోష్ పదో తరగతి, భువనేశ్వర్ ఆరో తరగతి చదువుతున్నారు. విషం తాగిన వీరంతా మృతిచెందినట్టు సమాచారం. పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలపై స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. 
 
బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ! 
 
ఇటీవల బ్యాంకాక్‌‌లో సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్‌కుమార్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. ఈ భూప్రకంపనల నుంచి ఎమ్మెల్యే భార్య మనాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధిశ్‌లు శనివారం మధ్యాహ్నం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. వీరంతా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని క్షేమంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తన కుటుంబ సభ్యులను చూడగానే ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ మాట్లాడుతూ, బంధువుల పెళ్లి కోసం వారు బ్యాంకాక్ వెళ్లారు. ఊహించని పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు అనేది భగవంతుడి దయ వల్లే జరిగింది అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 
 
అలాగే, ఎమ్మెల్యే భార్య మనాలి మాట్లాడుతూ, బంధువుల వివాహం వేడుక కోసం బ్యాంకాక్ వెళ్లిన మేము నోవాటెల్ హోటల్‌లోని 35వ అంతస్తులోని ఓ గదిలో బస చేశాం. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు ప్రారంభమకావడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని మెట్ల మార్గంలో వేగంగా బయటకు వచ్చాం. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, భవనం ఓ పక్కకు ఒరిగిపోవడంతో తామంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బయటకు వచ్చి చూసేసరికి కళ్లముందే భవనాలు పేకమేడల్లా కూలిపోవడం చూసి చాలా భయమేసింది అని చెప్పుకొచ్చారు. తాము సురక్షితంగా స్వదేశానికి వచ్చామంటే అదంతా ఆ భగవంతుడి దయ మాత్రమే అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!