హైదరాబాదులోని రాజేంద్ర నగర్ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ నగరంలో టాప్ మెహెందీ ఆర్టిస్టుగా పేరుగాంచిన పింకీ బలవన్మరణానికి పాల్పడింది. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
పింకీ గత ఏడాది అమిష్ లోయాతో కోర్టు మ్యారేజ్ చేసుకున్నది. ఇక ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ కలహాల వల్లనే పింకీ ఆత్మహత్య చేసుకున్నదంటూ ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పింకీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రిపోర్ట్ వచ్చాక ఆమెది ఆత్మహత్యా లేదా హత్య అన్నది నిర్థారిస్తామని పోలీసులు తెలిపారు.