Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Advertiesment
Comedian Ali

సెల్వి

, శనివారం, 29 మార్చి 2025 (18:35 IST)
టాలీవుడ్ కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ యాత్రికుడు అన్వేషణ తన యూట్యూబ్ ఛానల్‌లో ఆలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని.. అలీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంటూ బాంబు పేల్చాడు ప్రపంచ యాత్రికుడు. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న అన్వేష్ ఓ మజీద్‌ ముందు చేతిలో ఖురాన్‌ పట్టుకుని మాట్లాడుతూ ఓ వీడియో రూపొందించాడు.
 
అలీ గారి భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్‌కు సుమారు 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరు కనివినీ ఎరగని విధంగా తెలుగులో బిర్యానీ మోసం చేశారు. రూ. 10 వేలతో చికెన్‌ బిర్యానీ తయారు చేసి కొంతమంది అనాధలకు ఇచ్చారు. బిర్యానీ ప్యాకెట్ల పేరుతో సహాయం చేస్తున్నట్లు నటించి.. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోవడం మోసం కాదా అంటూ అన్వేష్‌ విరుచుకుపడ్డాడు.
 
భారతదేశాన్ని దెబ్బ తీయాలని పలు దేశాలు చేస్తున్న కుట్రలో భాగం కావడం ఎంత వరకు సబబు? అంటూ అన్వేష్‌ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి అంటూ ఆలీని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం