Publish Date: Fri, 28 Mar 2025 (20:06 IST)
Updated Date: Fri, 28 Mar 2025 (21:40 IST)
ఫోటో కర్టెసీ- Freepik
మనసే సుగంధం
తలపే తీయందం
కౌగిలి వెచ్చదనం
ప్రేమ అపురూపం
నీ చేతిలో నా చేయి బాస
నీ కన్నుల్లో నా నీడ ఘోష
నీ గుండెల్లో నా శ్వాస స్పర్శ
నీ ఆనందం నా పొదరిల్లు పరామర్శ
సుకుమార నీ పాదాల పైన
సుతిమెత్తగా నా అరచేతుల లాలన
నా గుండె గదులకు నీ ఆత్మీయ పాలన
నీ అణువణువూ నా ప్రాణమై....
నీకోసమే నిత్యం నిరీక్షిస్తూ...