Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

Advertiesment
Rare Brain Complication of Sjogren-s Syndrome

ఐవీఆర్

, శుక్రవారం, 28 మార్చి 2025 (19:51 IST)
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మెదడును ప్రభావితం చేసే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ యొక్క అరుదైన కేసును విజయవంతంగా గుర్తించి చికిత్స చేసింది, సాధారణంగా ఇందులో మెదడు సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఇది ఇన్ఫెక్షన్‌ కాకుండా ఇతర వేరే కారణాలను పరిశీలించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది.
 
ఒక 24 ఏళ్ల యువకుడు జ్వరం, నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అతను విరామం లేకుండా ఉన్నాడని, అతని మెడ గట్టిగా ఉందని వైద్యులు గమనించారు, కానీ స్ట్రోక్ లేదా పక్షవాతం యొక్క స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. మెదడు ఎంఆర్ఐ, స్పైనల్ ఫ్లూయిడ్ విశ్లేషణతో సహా ప్రారంభ పరీక్షలు, మెనింజైటిస్ వైపు చూపించాయి. కానీ ఏ ఇన్ఫెక్షన్‌ను గుర్తించబడలేదు.
 
సాధారణ అంటువ్యాధులకు చికిత్స ప్రారంభించినప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే, నోరు తీవ్రంగా పొడిబారడం గురించి అతని కుటుంబ సభ్యులతో జరిగిన వివరణాత్మక చర్చలో వెల్లడైన సమాచారం, వైద్యులను కొత్త దిశలో పరిశీలించేందుకు దారితీసింది. ఈ సూచన ఆధారంగా, వైద్యులు స్వయం ప్రతిరక్షక (ఆటోఇమ్యూన్) వ్యాధుల పరీక్షలను చేపట్టారు. రోగనిరోధక వ్యవస్థ తన స్వంత కణజాలాలపై దాడి చేసే పరిస్థితులు ఉన్నాయా అనే దిశగా పరిశీలించగా, రక్త పరీక్షలు స్జోగ్రెన్స్ సిండ్రోమ్‌కు సానుకూల ఫలితాలను చూపించాయి. చివరగా, లాలాజల గ్రంథుల నుండి తీసిన బయాప్సీ ద్వారా రోగ నిర్ధారణ ఖరారు చేయబడింది.
 
డాక్టర్ వంశీ చలసాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఇలా అన్నారు, "చాలా మంది ప్రజలు స్జోగ్రెన్స్ సిండ్రోమ్ కళ్ళు,నోటిని మాత్రమే ప్రభావితం చేస్తుందని భావిస్తారు, కానీ ఇది మెదడును కూడా ప్రభావితం చేయడం ద్వారా, ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. దీన్ని ముందుగానే గుర్తించడం వల్ల దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు".
 
రోగిని స్టెరాయిడ్ చికిత్స ప్రారంభించిన తర్వాత, అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. ప్రాథమిక స్థాయిలో కోలుకున్న తర్వాత, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడానికి అతన్ని దీర్ఘకాలిక మందులపై ఉంచారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో అతను స్థిరంగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డాడు. డాక్టర్ సుధాకర్ కాంతిపూడి, క్లస్టర్ డైరెక్టర్, హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఇలా అన్నారు, "తరచుగా విస్మరించబడే సంక్లిష్ట వ్యాధులను గుర్తించి, సమర్థవంతంగా చికిత్స చేయడంలో మా ఆసుపత్రి నైపుణ్యాన్ని ఈ కేసు స్పష్టంగా రుజువు చేస్తుంది. లక్షణాలను నిశితంగా పరిశీలించడం, వేగంగా చర్యలు తీసుకోవడం ద్వారా, మేము ఈ యువకుడికి జీవితంలో రెండవ అవకాశం కల్పించగలిగాము."
 
ఈ కేసు కొన్ని వ్యాధులు అసాధారణ లక్షణాలను కలిగి ఉండవచ్చని, అలాగే నిపుణుల వైద్య సంరక్షణ ప్రభావవంతమైన మార్పులను తీసుకురాగలదని గుర్తుచేస్తుంది. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ, రోగులకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను నిరంతరం అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?