విజయవాడ: మణిపాల్ హాస్పిటల్-విజయవాడ తన అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. సమాజానికి అత్యుత్తమ కార్డియాలజీ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు. సియమెన్స్ ఆర్టిస్ జీ సాంకేతికతతో నిర్మించిన ఈ క్యాథ్ ల్యాబ్ డిటెక్టర్‌తో గుండె, నరాల చికిత్సలకు మరింత తోడ్పడుతుంది. ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌తో, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఇప్పుడు రెండు అధునాతన క్యాథ్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇది స్థానిక, ప్రాంతీయ ప్రజలకు మెరుగైన గుండె సంబంధిత చికిత్స అందించేందుకు సహాయపడుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బి. సోమరాజు ప్రతి నెల చివరి శనివారం మనిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్‌గా అందుబాటులో ఉంటారు.
హాస్పిటల్ విజయాన్ని ప్రశంసిస్తూ పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ బి. సోమరాజు (సీనియర్ కన్సల్టెంట్- మెంటర్ డైరెక్టర్, సింధు హాస్పిటల్స్; నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్; కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు)మాట్లాడుతూ, "అత్యాధునిక సాంకేతికత మరియు పెరిగిన సామర్థ్యంతో, ఈ హాస్పిటల్ విభిన్న రోగుల అవసరాలను తీర్చగల అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది. సమాజం కోసం మెరుగైన ఫలితాలను అందించేందుకు ఇది గొప్ప ముందడుగు. మణిపాల్ హాస్పిటల్ బృందానికి అభినందనలు" అని చెప్పారు.
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంతిపూడి మాట్లాడుతూ, "ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభం ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ సేవల పురోగతిలో ఒక కీలక మైలురాయి. ఈ సౌకర్యం మా రోగుల పట్ల ఉన్న అంకితభావానికి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం," అని పేర్కొన్నారు. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్. మురళీ కృష్ణ ఈ క్యాథ్ ల్యాబ్ ప్రారంభంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, "ఈ సౌకర్యం క్లిష్టమైన గుండె చికిత్సలను మరింత ఖచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించే మా సామర్థ్యాన్ని పెంచుతుంది. రోగులకు అత్యుత్తమ గుండె సంరక్షణ అందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతను ఇది అందిస్తుంది," అని తెలియజేశారు.
ఈ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభం మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతనత, విశిష్టతను పెంపొందించే లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈ హాస్పిటల్ రోగులకు అత్యుత్తమ స్థాయి సేవలు అందించేందుకు అధునాతన కార్డియాక్, ఇంటర్వెన్షనల్ చికిత్సల సామర్థ్యాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉంది.