Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

Advertiesment
nidhi agarwal

ఠాగూర్

, ఆదివారం, 23 మార్చి 2025 (11:20 IST)
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేలా ఒప్పందం కుదుర్చుకోగానే నో డేటింగ్ అనే షరతు పెట్టారని హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించారు. చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ అనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 
 
బాలీవుడ్ నుంచి "సవ్యసాచి" సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో "మజ్ను" మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు ఇద్దరు బడా స్టార్స్ సినిమాలో చాన్స్ అందుకుంది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‍తో "హరిహర వీరమల్లు", ప్రభాస్ "రాజాసాబ్" చిత్రంలో నటిస్తున్నారు. 
 
తన కొత్త చిత్రాల అగ్రిమెంట్లలో ఉండే షరతులపై ఆమె నిధి స్పందిస్తూ, "బాలీవుడ్ చిత్రం 'మున్నా మైకేల్' మూవీతో నా సినీ కెరీర్‌ మొదలైంది. టైగర్ ప్రొఫ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఒకే చెప్పిన తర్వాత టీమ్‌ నాతో ఒక కాంట్రాక్ట్స్‌పై సంతకం చేయించుకుంది. సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో రాసివున్నాయి. 
 
అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యేవరకు హీరోతోనే నేను డేట్ చేయకూడదన్నది తన అర్థం. అయితే, కాంట్రాక్ట్ మీద సంతకం చేసినపుడు నేను పెద్దగా అవన్నీ చూడలేదు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. నటీనటులు ప్రేమలో పడితే మూవీపై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఇలాంటి షరతులు పెట్టి ఉంటుంది" అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే