Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 22 మార్చి 2025 (20:02 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రయత్నపూర్వకంగా కార్యం సిద్ధిస్తుంది. ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయయండి. మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభసమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే లక్ష్యాలు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు పనులు సాగవు. కొందరిరాక అసౌకర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. విజ్ఞతతో వివాదాలు పరిష్కరించుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీకు సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మంగళవారం నాడు మీ శ్రీమతితో అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అనివార్యం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్‌ను అశ్రద్ధ చేయకండి. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగల్గుతారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దు. బోగస్ సంస్థలు మోసగించేందుకు యత్నిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో వాయిదాలు చెలిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం కొంతమేరకు అనుకూలం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. అవేశాలకు లోనుకావద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగపరంగా విశేష ఫలితాలున్నాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. నూతన పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడుదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. మధ్యవర్తులు, ప్రకటలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై గురి కుదురుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం బాగుంటటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శనివారం నాడు ఆప్రియమైన వార్త వింటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. గృహమార్పు అనివార్యం. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేయొద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి