రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులకు ఆర్థికసాయం: నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:40 IST)
రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అభిమానుల్లో ఇద్దరు తమతమ ఇళ్లకు తిరిగిళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు ఇంటికి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ప్రకటించారు. 
 
అలాగే, ఈ ఘటనపై ఆయన స్పందించారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినపుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

విమానంలో ప్రయాణికురాలికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments