సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ప్రభాస్ ఒకరు. 45 ఏళ్ల నటుడికి భారీ మహిళా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కానీ అతను వివాహం పట్ల అంతగా మొగ్గు చూపడం లేదు. తన స్నేహితుడు ప్రేమలో విఫలం కావడంతో అతనిని చూసి స్నేహితుడి తల్లి రోదించిన విషయం ప్రభాస్ మనసులో బాగా నాటుకుపోయిందని.. అప్పటి నుంచి ప్రేమంటే ప్రభాస్‌కు కాస్త పడదని టాక్.
స్నేహితుడి బాధ చూసి ప్రేమకు ప్రభాస్ బాగానే దూరం అయ్యాడు. దీంతో ప్రేమ-పెళ్లి అంటేనే ప్రభాస్ ఆమడ దూరం పారిపోతున్నాడని టాక్. ఇక ప్రభాస్ పెళ్లిపై ఊహాగానాలు కొత్తేమీ కాదు. ఇటీవల ప్రభాస్ కుటుంబం నుంచి త్వరలో డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా తెలియరాలేదు.
ప్రభాస్ తన ప్రెస్ మీట్‌లలో తన పెళ్లి ప్లాన్‌ల గురించి స్వయంగా ఆటపట్టించాడు. తన మహిళా అభిమానుల హృదయాలను బద్దలు కొట్టడం ఇష్టం లేకనే తాను పెళ్లి చేసుకోవడం లేదని ప్రభాస్ ఇటీవల చెప్పుకొచ్చాడు.