Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అంటున్న మిల్కీ బ్యూటీ

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (15:08 IST)
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ఉండగా, అందులో తమన్నా నటించింది. ముఖ్యంగా, ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నా... ఆర్మీ ప్యాంట్స్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని ఇరగదీసింది. 
 
'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అనే ఫన్నీ లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెష‌ల్ సెట్ వేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. మహేష్ బాబు, త‌మ‌న్నా పోటాపోటీగా స్టెప్స్ వేశారు. 
 
తాజాగా డాంగ్ డాంగ్ సాంగ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాంగ్‌కి సంబంధించిన విష‌యాల‌ని త‌మ‌న్నా, అనీల్ రావిపూడి పంచుకున్నారు. 'సరిలేరు నీకెవ్వ‌రు' చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించారు. 
 
అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య‌శాంతి దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో వెండితెర‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. జ‌న‌వ‌రి 11న చిత్రం విడుద‌ల కానుంది. ఇటీవలే ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక జరిగిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments