Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సర్దార్' పాదాల చెంత ఉన్నది.. పిట్టా.. రెట్టా : కన్నడ నటి దివ్య కామెంట్స్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:39 IST)
ఇటీవల నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన సర్దార్ పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. 182 మీటర్ల పొడవైన భారీ విగ్రహం పాదాల చెంత నరేంద్ర మోడీ నిలబడ్డారు. అపుడు ఆయన ఆవగింజంత పరిమాణంలో కనిపించారు. 
 
దీనిపై కాంగ్రెస్ సోషల్‌మీడియా ఇన్‌చార్జి దివ్య స్పందన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 'పిట్ట రెట్టలా' ఉంది అని ప్రధానిపై దివ్య చేసిన కామెంట్లపై కమలనాథులు మండిపడుతున్నారు. దివ్య స్పందన భాష అహంకారపూరితమని విమర్శించింది. 
 
దీనిపై బీజేపీ అధికారప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ప్రధానిని విమర్శించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. దివ్య వాడిన భాష కాంగ్రెస్ నిజ సంస్కృతిని తేటతెల్లం చేస్తున్నది అంటూ ధ్వజమెత్తారు. 
 
సామాన్య భారతీయులు కాంగ్రెస్‌కు పిట్ట రెట్టల్లాగే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యల్ని దివ్య సమర్థించుకున్నారు. నా వ్యాఖ్యలపై ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments