వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (13:43 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. "ఏ వార్ ఆఫ్ లవ్" అనే చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డి రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. 
 
"జగ్గారెడ్డి - ఏ వార్ ఆఫ్ లవ్" చిత్రం వచ్చే యేడాది ఉగాదికి విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందులో తన పాత్ర విరామ సమయానికి ముందు వచ్చి సినిమా పూర్తయ్యేంత వరకు ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కూడా తీసుకున్నట్టు చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లను కూడా ఆయన రిలీజ్ చేయగా, ఇందులో జగ్గారెడ్డి వైలెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. దీంతో జగ్గారెడ్డి వెండితెర ప్రవేశం  ఇపుడు చిత్రపరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments