Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

Advertiesment
abhishek mohanty

ఠాగూర్

, శనివారం, 8 మార్చి 2025 (19:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సింగంగా పేరుగడించిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి. కరీంనగర్ పోలీస్ కమిషనరుగా తనదైనముద్ర వేశారు. అంతేకాదు ఆయనకు ఎక్కడ పోస్టింగ్ వేసినా నిజాయితీకి మారుపేరులా, అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరిస్తారని ఆయనకు మంచి పేరుంది. తాజాగా ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి కేంద్రం రిలీవ్ చేసి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 
 
దీంతో ఆయనకు సహచరులు భారీ సెండాఫ్ పార్టీ ఇచ్చారు. కరీంనగర్ నుంచి వెళ్లిపోతున్న అభిషేక్ మహంతికి పోలీస్ సహచరులు గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. ఓ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు.. బ్యాక్ గ్రౌండ్‌లో గబ్బర్ సింగ్ పాట వస్తుండగా అభిషేక్ మహంతిని తమ భుజాలపై ఎత్తుకుని ఫంక్షన్ హాలంతా కలియతిరిగారు. కాగా, నిజాయితీకి మారుపేరైన అభిషేక్ మహంతి... అక్రమార్కుల పట్ల సింహస్వప్నంలా వ్యవహరిస్తారు. దీంతో ఆయనకు తెలంగాణ సింగం అనే నిక్ నేమ్ కూడా ఉంది. 
 
కాంగ్రెస్‍‌లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్నారు : రాహుల్ గాంధీ 
 
తమ సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఉంటూ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని తక్షణం గుర్తంచాలని ఆయన ఆదేశించారు. మన బాధ్యతను నెరవేర్చేంత వరకు అధికారం ఇవ్వమని గుజరాత్ ప్రజలను అడకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పార్టీ కార్యర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 
 
తమ పార్టీ బాధ్యతలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు తమకు (కాంగ్రెస్) ఓటు వేయమని అడగరాదని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ అందించిన పాలన విఫలమైందన్నారు. గుజరాత్ ప్రజలు కొత్త విజన్ కోసం వేచి చూస్తున్నారని అన్నారు. ఆశించిన విధంగా రాష్ట్ర ప్రగతి సాధించడం లేదని, కాంగ్రెస్ కూడా అందుకు సరైన మార్గాన్ని చూపించలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గుజరాత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాలుగా ఉన్నారు. నిజాయితీగా పనిచేస్తూ ప్రజలను గౌరవిస్తూ వారి కోసం పోరాడుతూ పార్టీ సిద్దాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకునేవారు ఒకరు. రెండో రకానికి వస్తే ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారికి దూరంగా ఉండటమే కాకుండా, గౌరవం కూడా ఇవ్వరు. ఇందులో సగం మంది భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!